ఇన్ని వార్తలు వస్తున్నా, ఈ పెళ్లి వార్తలను అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ అధికారికంగా ధృవీకరించలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. మరి నవంబర్ 10న గ్రీస్‌లో పెళ్లి ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.
పెళ్లికి ముందు ఫుల్ బిజీ!
ఈ రూమర్స్ మధ్యలో, అనిరుధ్ తన కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అతను, ప్రస్తుతం బిగ్ మూవీస్‌కి సంగీతం అందిస్తున్నాడు. పెళ్లికి ముందే తన కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేయాలని చూస్తున్నాడట. అతని అప్‌కమింగ్ ప్రాజెక్టులలో 'ది ప్యారడైజ్', 'జైలర్ 2' వంటి సినిమాలు ఉన్నాయి. కమల్ హాసన్, రజనీకాంత్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా మ్యూజిక్ పనులను కూడా పెళ్లికి ముందే పూర్తి చేసే అవకాశం ఉంది.