Anirudh Kaviya Wedding Reception: ధోని, అజిత్, విజయ్‌, రష్మిక, నయనతార.. స్టార్ల సందడి

Published : Nov 23, 2026, 10:04 AM IST

Anirudh Kaviya Wedding Reception: అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్ వేడుకకు స్టార్ హీరో అజిత్ కుమార్ నుంచి క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని దాకా ఎందరో ప్రముఖులు హాజరై సందడి చేశారు.

PREV
18
అనిరుధ్ - కావ్య మారన్ రిసెప్షన్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్ వేడుక సినిమా, రాజకీయ, క్రీడా ప్రముఖులతో కోలాహలంగా సాగింది. నవంబర్ 21న మొదలైన ఈ గ్రాండ్ ఈవెంట్, నవంబర్ 22న కూడా కొనసాగింది. చాలా మంది ప్రముఖులు వచ్చి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

28
అజిత్ కుమార్ ఎంట్రీ

రెండో రోజు జరిగిన ఈ రిసెప్షన్‌కు స్టార్ హీరో అజిత్ కుమార్ రావడం హైలైట్‌గా నిలిచింది. అజిత్‌ను చూసిన వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరూ కలుసుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

38
మాస్ ఎంట్రీ ఇచ్చిన ధోని

ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రాక నిలిచింది. తన భార్య సాక్షితో కలిసి వచ్చిన ధోని.. అనిరుధ్, కావ్యలను ఆశీర్వదించారు. ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని చెన్నైలో హాజరైన తొలి ఈవెంట్ ఇదే.

48
ధోని - అజిత్ కలయిక

ఒకవైపు కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్, మరోవైపు క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని ఒకే వేదికపైకి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'రెట్టై తల' పేరుతో అజిత్, ధోని ఫోటోలను ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

58
తారల సందడి

ఈ రిసెప్షన్‌కు విఘ్నేష్ శివన్ - నయనతార జంటగా వచ్చారు. దర్శకుడు అట్లీ కూడా తన భార్య ప్రియతో కలిసి అనిరుధ్ - కావ్య జంటను విష్ చేశారు. వీరితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్, హెచ్.వినోత్, అశ్వత్ మరిముత్తు, ప్రదీప్ రంగనాథన్ లాంటి డైరెక్టర్లు కూడా హాజరయ్యారు.

68
సింబు - శివకార్తికేయన్ హాజరు

అనిరుధ్ స్నేహితులైన సిలంబరసన్ (సింబు), శివకార్తికేయన్ కూడా ఈ రిసెప్షన్‌కు వచ్చారు. సింబు నటిస్తున్న కొత్త సినిమా 'అరసన్'కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శివకార్తికేయన్‌కు కూడా అనిరుధ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు.

78
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రిసెప్షన్

రెండు రోజుల పాటు జరిగిన ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఈవెంట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.

88
విజయ్‌ దేవరకొండ, రష్మిక స్పెషల్‌ ఎట్రాక్షన్‌

అనిరుధ్‌, కావ్య మారన్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో టాలీవుడ్‌ స్టార్స్ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కూడా పాల్గొన్నారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరు శంకర్‌తో కలిసి మాట్లాడుతున్న ఫోటో వైరల్‌గా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories