బిగ్ బాస్ తెలుగు 10.. వైల్డ్ కార్డ్ ద్వారా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని దించుతుంటారు. కానీ గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా వీక్ కంటెస్టెంట్లని దించారు. ఒక్క శివ తప్ప మిగిలిన వారు ఎవరూ సరైన కంటెంట్ ఇవ్వడంలో, గేమ్స్ ఆడటంలో, ఎంటర్‌టైన్ చేయడంలో వెనకబడ్డారు. దీంతో వరుసగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే అపూర్వ, శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 11వ వారంలో నీతూ మాస్టర్ హౌజ్‌ని వీడారు. ఇంకా రామకృష్ణ, శివ కుమార్ ఉన్నారు. రామకృష్ణ కూడా ఈ వారమో, వచ్చే వారమో బయటకు వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.