ఒక వ్యక్తి ఇచ్చిన సలహా వల్ల మహేష్ బాబు నటించిన భారీ బడ్జెట్ చిత్రం డిజాస్టర్ అయింది అని నిర్మాత అన్నారు. నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం మహేష్ ఎంతగానో కష్టపడుతున్నారు. కెరీర్ లో తొలిసారి బాగా హెయిర్ పెంచి డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు నటించిన ఒక ఫ్లాప్ మూవీ ప్రస్తావన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిర్మాత చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం.
DID YOU KNOW ?
SSMB 29 ఫస్ట్ రివీల్ నవంబర్ లో
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా నవంబర్ లో ఉండబోతున్నట్లు రాజమౌళి ఆల్రెడీ ప్రకటించారు.
25
1 నేనొక్కడినే మూవీ ఫ్లాప్ కి కారణం
దాదాపు పదేళ్ల క్రితం మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో 1 నేనొక్కడినే చిత్రం వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. సుకుమార్ టేకింగ్, కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఫ్యాన్స్ కి నచ్చలేదు. ముఖ్యంగా మహేష్ బాబుకి మానసిక సమస్య ఉన్నట్లు చూపించడం, కన్ఫ్యూజన్ డ్రామా నెగిటివ్ గా మారాయి. దీనితో భారీ బడ్జెట్ లో రూపొందిన 1 నేనొక్కడినే నిరాశ పరిచింది.
35
నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్
కానీ మహేష్ ఫ్యాన్స్ కొంతమంది ఆ చిత్రాన్ని కల్ట్ మూవీ అని అభివర్ణిస్తుంటారు. ఈ చిత్రం గురించి నిర్మాత అనిల్ సుంకర రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కడి మాట వినడం వల్లే 1 నేనేఒక్కడినే డిజాస్టర్ అయింది అన్నట్లుగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. అనిల్ సుంకర మాట్లాడుతూ.. 1 నేనొక్కడినే చిత్రానికి ట్రైలర్ లాంచ్ చేయలేదు. ట్రైలర్ లేకుండానే ఆ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేశాం.
మేం చేసిన బిగ్ మిస్టేక్ అదే. అప్పట్లోనే ఆ చిత్ర ట్రైలర్ ని థియేటర్స్ లో ప్రదర్శించాలని అనుకున్నాం. ట్రైలర్ లాంచ్ కోసం ఈవెంట్ కూడా ఏర్పాటు చేశాం. ట్రైలర్ లాంచ్ కోసం స్టేజి మీదికి వెళుతున్న టైంలో ఒక వ్యక్తి నాతో.. ఈ ట్రైలర్ లాంచ్ చేస్తే సినిమాకి అస్సలు ఓపెనింగ్స్ ఉండవు అని చెప్పారు. దీనితో మేమంతా కంగారు పడి ట్రైలర్ ఆపేశాం.
55
అతడి మాట వినడం వల్లే మూవీ ఫ్లాప్
వాస్తవానికి ట్రైలర్ లో సినిమా కాన్సెప్ట్ మొత్తం చెప్పేయాలనేది మా ఆలోచన. కానీ ట్రైలర్ లాంచ్ జరగలేదు. దీనితో థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్..మహేష్ కి మానసిక సమస్య ఉందని తెలియగానే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అదే సినిమాకి పెద్ద మైనస్ అయింది. ట్రైలర్ లాంచ్ చేసి ఉంటే ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని ముందే ప్రిపేర్ చేసి ఉండే అవకాశం ఉండేది. అలా జరగకపోవడం వల్లే 1 నేనొక్కడినే నిరాశపరిచింది అని అనిల్ సుంకర అన్నారు. వాస్తవానికి 1 నేనొక్కడినే చిత్రంతో దూకుడు రికార్డులు బ్రేక్ చేయాలని అనుకున్నాం. అది జరగలేదు అని అన్నారు.