ఫాల్ ఫర్ మీ (ఆగస్టు 21) : లిల్లీ తన చెల్లెలి ఫియాన్సీపై అనుమానం పెంచుకుంటుంది. కానీ ఆమె జీవితంలోకి సడెన్ గా ఒక స్ట్రేంజర్ ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది అనేది ఈ చిత్ర కథ. స్వెన్జా జంగ్, థియో ట్రెబ్స్ ఈ చిత్రంలో నటించారు. ఘాటైన రొమాన్స్, బోల్డ్ సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా మాత్రమే చూడాలి.
వెల్‌కమ్ టు సడన్ డెత్ (ఆగస్టు 21) : మైకెల్ జై వైట్ నటించిన యాక్షన్ డ్రామా ఆగష్టు 21న రిలీజ్ అవుతోంది.
అబాండన్డ్ మ్యాన్ (ఆగస్టు 22) : తన అన్న చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కథగా ఈ చిత్రం రూపొందింది.
మారీసన్ (ఆగస్టు 22) : వడివేలు, ఫహద్ ఫాజిల్ నటించిన కామెడీ డ్రామా చిత్రం మారీసన్.
హోస్టేజ్ (ఆగస్టు 21) : బ్రిటన్ ప్రధాని భర్త కిడ్నాప్ అవ్వగా, ఫ్రాన్స్ అధ్యక్షుడికి బెదిరింపులు వస్తాయి. దీనితో వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులని ఎదురుకొన్నారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు.