చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?

Published : Dec 17, 2025, 10:30 AM IST

Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. 

PREV
15
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తొలి చిత్రం

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల నిడివి ఉండే కామియో రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

25
మీడియం బడ్జెట్ లో అనిల్ రావిపూడి సినిమాలు

మన శంకర వరప్రసాద్ గారు సినిమా అనిల్ రావిపూడి స్టైల్ లో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ మిక్స్ చేసిన సింపుల్ కథతో తెరకెక్కుతోంది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు మీడియం బడ్జెట్ లో రూపొందుతుంటాయి. అనిల్ రావిపూడి ఎక్కువగా ఫ్యామిలీ అండ్ కామెడీ అంశాలు ఉన్న సినిమాలే చేస్తుంటారు. ఆ చిత్రాలకు ఎక్కువ బడ్జెట్ అవసరం ఉండదు. మన శంకర వరప్రసాద్ మూవీ కూడా అలాంటి చిత్రమే. కానీ ఈ చిత్రాన్ని బడ్జెట్ అమాంతం పెరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

35
అనిల్ రావిపూడి రెమ్యునరేషన్

హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్స్ కే ఎక్కువ బడ్జెట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు అనిల్ రావిపూడి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనిల్ తన పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది.

45
చిరంజీవి రెమ్యునరేషన్

ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారా అనే ప్రశ్న ఎదురుకాగా అనిల్ రావిపూడి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 25 కోట్లు అనేది నాకు రీజనబుల్ రెమ్యునరేషన్ కానీ నేను అంత తీసుకోలేదు అని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ కోసం ఏకంగా 70 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరి రెమ్యునరేషన్స్ తోనే బడ్జెట్ 90 కోట్లకు పైనే అవుతుంది. ఇక నయనతార రెమ్యునరేషన్, వెంకటేష్ కామియో రోల్ కి చేసిన రెమ్యునరేషన్ ఇవన్నీ కలుపుకుంటే బడ్జెట్ లెక్క ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

55
మన శంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ డేట్

అయితే ఈ చిత్ర బడ్జెట్ కంట్రోల్ తప్పకుండా, సినిమా క్వాలిటీ లో రాజీ పడకుండా తెరకెక్కించినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. 80 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు అనిల్ పేర్కొన్నారు. సినిమాలో ఫన్, 3 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని అనిల్ తెలిపారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories