Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం

Published : Dec 17, 2025, 09:23 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 17: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో పెద్దోడు రామరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆ రోజు అమూల్య, విశ్వ ప్రేమ విషయం చెప్పేయాలని నిర్ణయించుకుంటాడు.ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
16
వేదవతిని ఏడిపించిన నర్మద

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో పెద్దోడు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ రామరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలా అయినా అమూల్య, విశ్వ ప్రేమ విషయం తన తండ్రికి చెప్పేయాలని నిర్ణయించుకుంటాడు. వేదవతి పెద్దోడిని చూసి ఆశ్చర్యంగా ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడి నుంచి సీన్ నర్మద, ప్రేమ టీ పెడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ రాత్రి డాన్సులు, పాటల కోసం కాసేపు ఒకరినొకరు ఏడిపించుకుంటారు. ఈలోపు వేదవతి అక్కడికి వచ్చి ‘అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ పొద్దున్నే గుసగుసలు పెట్టారు’ అంటూ మొదలు పెడుతుంది. దానికి నర్మదా మేము యూత్ అండి మాకు సవాలక్ష గుసగుసలు ఉంటాయి అనే వేదవతిని మళ్లీ రెచ్చగొడుతుంది. రాత్రి రామరాజుతో సినిమాకి వెళ్లిన విషయాన్ని వేదవతి మెలికలు తిరుగుతూ కోడళ్ళకు చెబుతుంది. వేదవతిని నర్మద కాసేపు బాగా ఏడిపిస్తుంది. తర్వాత నర్మద అందరికీ టీ పెట్టి ఇస్తుంది. వల్లి మాత్రం తన గదిలో ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది.

26
సమయానికి లేచిన వల్లి

ఇక ఇక్కడ నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. తిరుపతి, రామరాజు కలిసి పేపర్ కొనుక్కొని ఇంటికి వస్తూ ఉంటారు. తిరుపతి పేపర్ చదువుతూ బావ నీ జీవితంలో ఈ రోజు ఊహించని ఘటనలే జరుగుతాయట అని చెబుతాడు. దానికి రామరాజు మీ ఇంటి వాళ్ళు నా మీద ఏదో గొడవపడడానికి రెడీగా ఉంటారు కదా.. అందులో ఏముందిలే అని కొట్టి పడేస్తాడు. ఇంటిదగ్గర పెద్దోడు మాత్రం రామరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు రామరాజు గేట్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. పెద్దోడు రామరాజుని ఆపి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్నా అని అంటాడు. ఈలోపు వేదవతి వచ్చి టీ రామరాజుకి ఇస్తుంది. నేను ఎంత అడిగినా కూడా పెద్దోడు విషయం చెప్పకుండా నీకోసమే ఎదురు చూస్తున్నాడని చెబుతుంది.వెంటనే పెద్దోడు చెల్లెలు అమూల్య గురించి నీతో మాట్లాడాలని అంటాడు. ఈలోపు వల్లి మంచం మీద నుంచి కింద పడి లేస్తుంది. తన భర్త అమూల్య విషయం చెప్పేస్తున్నాడు అనుకుని గాభరా పడుతూ అక్కడికి వస్తుంది.

36
మళ్లీ అడ్డుకున్న వల్లి

పెద్దోడు రామరాజుకు విషయం చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు అక్కడికి అమూల్య వస్తుంది. అమూల్య కూడా భయంతో అన్నయ్యను, తండ్రిని చూస్తూ ఉంటుంది. ‘అమూల్యకు సంబంధించిన అంత ముఖ్యమైన విషయం ఏమిటి’ అని రామరాజు గుచ్చి గుచ్చి అడుగుతాడు. ఈలోపే వల్లి పరిగెత్తుకుంటూ రావడం మొదలు పెడుతుంది. వల్లి వచ్చి అమూల్యని ప్రతిరోజు మీ పెద్దబ్బాయి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలనుకుంటున్నాడట.. అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాడు.. అంతకుమించి ఏం లేదు అని మాట మార్చేస్తుంది. ‘ఇదేనండి మీతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం’ అని అంటుంది వల్లి. కానీ రామరాజు ‘మరి రాత్రి మన ఇంటి పరువు కి సంబంధించిన విషయం నాన్నా అని చెప్పాడు పెద్దోడు’ అని అడుగుతాడు. అమూల్యను ఒంటరిగా కాలేజ్ కి పంపిస్తే పోకిరి వెధవలు అమూల్యని ఆట పట్టిస్తే మన ఇంటి పరువు పోతుంది కదండీ అందుకే మీ అబ్బాయి అలా చెప్పారు అని కవర్ చేస్తుంది వల్లి.

46
వల్లిని ఇరికించిన ప్రేమ, నర్మద

రామరాజు అది విని అమూల్యని ప్రతిరోజు నువ్వే కాలేజీకి దిగిపెట్టి సాయంత్రం తీసుకుని రా అని చెబుతాడు. వల్లి.. అమూల్య, పెద్దోడు చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి బండి ఎక్కించి బయలుదేరండి అని పంపించేస్తుంది. ఇక వెళ్లాక వల్లి పెద్ద గండం నుంచి గట్టెక్కాను అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఈ లోపు ఎదురుగా నర్మద, ప్రేమ వచ్చి వల్లి ముందు నిలుచుంటారు. మావయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అని వల్లిని అడుగుతారు. నేనేం మాట ఇచ్చాను అని అడుగుతుంది వల్లి. అప్పుడు ప్రేమ ‘జాబ్ చేస్తానని మావయ్య గారికి మాట ఇచ్చావుగా అది నిలబెట్టుకోవా’ అని ప్రశ్నిస్తుంది. దీంతో వల్లి ఒక్కసారిగా భయపడిపోతుంది. నర్మదా మాట్లాడుతూ ‘నీ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్ మీ అమ్మ వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు కదా అక్క..ఆన్లైన్లో అప్లై చేస్తే వెంటనే వచ్చేస్తాయి కదా ఇంతవరకు రాలేదంటే ఏదో మతలబు ఉంది’ అంటూ వల్లిని కంగారు పెట్టేస్తారు. నువ్వు చదవలేదు అన్నమాట మావయ్య గారికి అబద్ధం చెప్పి మోసం చేసావన్నమాట అంటూ వల్లిని భయపెట్టేస్తుంటారు.

56
నిలదీసిన రామరాజు

రామరాజు కూడా అది విని వల్లిని దగ్గరికి పిలిచి ‘నీ ఎమ్మే సర్టిఫికెట్లు ఎన్ని రోజులైనా ఎందుకు రాలేదు, వాళ్లకి వచ్చిన డౌటే ఇప్పుడు నాకు వస్తోంది నువ్వు నిజంగా ఎమ్మే ఇంగ్లీష్ చదివావా లేదా’ అని ప్రశ్నిస్తాడు. ‘ఫోన్లో ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏదీ మాట్లాడలేదు, సర్టిఫికెట్ విషయంలో కూడా ఇలాగే నీళ్లు నములుతున్నావు, నిజంగా నువ్వు చదివావా లేదా’ అని గట్టిగా అడుగుతాడు. ఈ లోపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఎంట్రీ ఇస్తారు. మా అమ్మాయిది ఎమ్మే సర్టిఫికెట్ పట్టుకొచ్చానండి చూడండి అంటూ రామరాజు చేతికి ఇస్తుంది. దాన్ని నర్మదా ప్రేమ తీసుకుని చూసేందుకు ప్రయత్నిస్తారు. కానీ భాగ్యం ఇవ్వదు. రామరాజు వాటిని చూసి ప్రేమ నర్మదలకు ఇచ్చే సరిగ్గా ఉన్నాయో లేదో చూడమని అడుగుతాడు. ఇద్దరూ ఆ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. అది దొంగ సర్టిఫికెట్ అని ప్రేమ, నర్మద ఎక్కడ కనిపెట్టేస్తారో అన్న భయంతో వల్లి, ఇడ్లీ బాబాయ్, భాగ్యం చాలా భయపడిపోతూ ఉంటారు.

66
వల్లికి ఉద్యోగం వెతుకులాట

ప్రేమ మాట్లాడుతూ ఇది నిజమైన సర్టిఫికెట్ అని రామరాజుకి చెబుతుంది. ‘మీరందరూ నన్ను అనుమానించారు కదా.. ఇప్పుడు సర్టిఫికెట్ చూశారు కదా ఇప్పుడు ఏమంటారు’ అని అడుగుతుంది వల్లి. సర్టిఫికెట్ పట్టుకొని జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్ళమని అంటుంది నర్మద. దాంతో ఇడ్లీ బాబాయ్, వల్లి, భాగ్యం మళ్లీ షాక్ అవుతారు. వేదవతి కూడా ఉద్యోగానికి వెళ్ళమని చెబుతుంది. ప్రేమ మాట్లాడుతూ ‘మొన్న మన ఇంటికి ఒక స్కూల్ ప్రిన్సిపల్ గారు వచ్చారు కదా.. ఆయనకి ఫోన్ చేసి వల్లి అక్కకి ఇంగ్లీష్ టీచర్ పోస్ట్ కావాలని అడగండి మామయ్యా’ అని రామరాజుకి చెబుతుంది. మీరు అడిగితే కచ్చితంగా వల్లి అక్కకి జాబ్ వస్తుంది అని చెబుతుంది. రామరాజు దానికి ఓకే అని చెబుతాడు. ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వల్లి కావాలనే తుమ్ముతుంది. తుమ్ము మంచిది కాదు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో రామరాజు ఆగిపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories