ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మాట దాటవేస్తాడు మహేంద్ర. చెప్పాలనుకున్న విషయమైతే రిషి ఏ చెప్తాడు కదా అలాంటప్పుడు మహేంద్ర సార్ మాత్రం ఎలా చెప్తారు అని మనవరాల్ని మందలిస్తాడు విశ్వనాథం. రిషి వాళ్ళని వెళ్లి రెస్ట్ తీసుకోమంటాడు విశ్వనాథం. రిషి, మహేంద్ర కూడా వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోతారు. గదిలోకి వెళ్ళిన తర్వాత తండ్రి ఒడిలో తల పెట్టుకొని బాగా ఎమోషనల్ అవుతాడు రిషి. మన జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయి. చాలా రోజుల వరకు నాకు అమ్మ విలువ తెలియలేదు.