గర్భవతి అయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ పిక్స్

Published : Aug 02, 2023, 10:31 PM IST

సెలెబ్రిటీలు తల్లిదండ్రులు అవుతుంటే సోషల్ మీడియాలో వారికి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. బిగ్ బాస్ లాంటి క్రేజీ షోలతో చాలా మంది పాపులర్ అవుతున్నారు.

PREV
16
గర్భవతి అయిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ పిక్స్

సెలెబ్రిటీలు తల్లిదండ్రులు అవుతుంటే సోషల్ మీడియాలో వారికి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. బిగ్ బాస్ లాంటి క్రేజీ షోలతో చాలా మంది పాపులర్ అవుతున్నారు. బిగ్ బాస్ షోలలో కొందరు రియల్ లైఫ్ లవ్ బర్డ్స్.. భార్య భర్తలు జంటగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

26

హిందీ బిగ్ బాస్ సీజన్ 9 లో నటి, మోడల్ అయిన రోషెల్లీ రావు తన ప్రియుడు కీత్ సేక్వేరా జంటగా పాల్గొన్నారు. దీనితో వీరికి మంచి గుర్తింపు లభించింది. అయితే కీత్  తన పర్సనల్ లైఫ్ తో అంతకు ముందే వార్తల్లోనిలిచాడు.

36

అతడికి 2005లోనే నటి సంయుక్త సింగ్ తో వివాహం జరిగింది. వీరిద్దరూ విభేదాల కారణంగా 2011లో విడిపోయారు. అనంతరం కీత్, రోషెల్లీ మధ్య ఓ చర్చిలో పరిచయం ఏర్పడింది. 

46

 అది ప్రేమగా మారడంతో ఈ జంట సహజీవనం మొదలు పెట్టారు. అలాగే జంటగా బిగ్ బాస్ 9లో పాల్గొన్నారు. ఆ తర్వాత మాల్దీవుల్లో ఈ జంట వివాహం చేసుకుని అధికారికంగా ఒక్కటయ్యారు. 

56

తాజాగా రోషెల్లీ, కీత్ అందరిని సర్ప్రైజ్ చేస్తూ తాము త్వరలో తల్లి దండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రోషెల్లీ, కీత్ షేర్ చేసిన మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

66

రోషెల్లీ పిక్ డ్రెస్ లో నిండు గర్భవతిగా బేబీ బంప్ చూపిస్తూ ఇస్తున్న ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఎంతో అందంగా ఉన్న ఈ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెండు చిన్ని చేతుల.. రెండు చిన్ని కాళ్ళు.. మా బిడ్డని కలుసుకునేందుకు వేచి చూడలేకున్నాం. ఇది మాకు అద్భుతమైన బహుమతి. మమ్మల్ని ఆశీర్వదించిన అందరికి కృతజ్ఞతలు అని రోషెల్లీ, కీత్ తమకి బిడ్డ పుట్టబోతున్న సంగతిని ప్రకటించారు. అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ జంటకి విషెస్ చెబుతున్నారు. 

click me!

Recommended Stories