'సైయారా' నటి అనీత్ పడ్డా లాగే సూపర్ హిట్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీళ్ళే.. ఆ ఇద్దరూ పవన్ తో..

Published : Jul 23, 2025, 03:51 PM IST

అనీత్ పడ్డా 'సైయారా' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనీత్ కాకుండా, బాలీవుడ్ లో మరికొందరు హీరోయిన్లు సక్సెస్ ఫుల్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు. 

PREV
18
అనీత్ పడ్డా - సైయారా

అనీత్ పడ్డా 'సైయారా ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి చిత్రమే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 172 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో అనీత్ పడ్డా బాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

28
అలియా భట్ - ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో అలియా భట్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 59 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 109 కోట్లు వసూలు చేసింది.

38
దీపికా పదుకొనే - ఓం శాంతి ఓం

2007లో ఓం శాంతి ఓం సినిమాతో దీపికా పదుకొనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్ సరసన దీపికా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 149 కోట్ల బిజినెస్ చేసింది.

48
అనుష్క శర్మ - రబ్ నే బనా ది జోడి 

2008లో వచ్చిన రబ్ నే బనా ది జోడి సినిమాతో అనుష్క శర్మ నటనా రంగంలోకి అడుగుపెట్టింది.షారుఖ్ తో ఆమె జంటగా నటించిన తొలి సినిమా బ్లాక్ బస్టర్. 31 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 157 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. ఫ్యామిలీ కోసం అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. 

58
అమీషా పటేల్ - కహో నా ప్యార్ హై

2000 సంవత్సరంలో కహో నా ప్యార్ హై సినిమాతో అమీషా పటేల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అమీషా తొలి సినిమా బ్లాక్ బస్టర్. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 80 కోట్ల బిజినెస్ చేసింది. తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ కూడా సూపర్ హిట్. 

68
అసిన్ - గజిని 

బ్లాక్ బస్టర్ చిత్రం గజినితో అసిన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించింది. 2008లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 52 కోట్లు కాగా అది 194.58 కోట్లు వసూలు చేసింది. వివాహం తర్వాత ఆసిన్ నటన మానేసింది. తెలుగులో ఆమె వెంకటేష్, పవన్, రవితేజ లాంటి హీరోలతో నటించింది. 

78
ట్వింకిల్ ఖన్నా - బర్సాత్ 

ట్వింకిల్ ఖన్నా 1995లో బర్సాత్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.  8.25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం  34 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ట్వింకిల్ ఖన్నాకి సరైన హిట్ పడలేదు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. 

88
జాన్వీ కపూర్ – ధడక్

జాన్వీ కపూర్ 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె మొదటి సినిమా హిట్ అయింది. 41 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 112.98 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం జాన్వీ సౌత్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. ఇప్పటికే దేవర చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం రాంచరణ్ పెద్ది చిత్రంలో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories