కెప్టెన్సీ టాస్క్ ని స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్. వచ్చే వారానికిగానూ కెప్టెన్సీకి పోటీదారుల టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు `బీబీ బొమ్మల ఫ్యాక్టరీ` పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో సభ్యులు నాలుగు టీమ్‌లుగా విడిపోయి, బిగ్‌బాస్ ఇచ్చిన బొమ్మల ముక్కలను పట్టుకుని వాటిని బొమ్మకి అమర్చి పర్‌ఫెక్ట్ టెండీలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో మాసన్, సన్నీ, ఆనీ మాస్టర్ బ్లూ టీమ్‌లో, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంకలు ఎల్లో టీమ్, విశ్వ, శ్రీరామ్, ప్రియా రెడ్ టీమ్, రవి, లోబో, శ్వేత గ్రీన్ టీమ్‌లుగా ఉన్నారు.