Bigg Boss Telugu 5లో భాగంగా 68వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. బిగ్ బాస్ హౌటల్ టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. సరదాగా మొదలైన నేటి ఎపిసోడ్ ఆ తర్వాత సీరియస్ టర్న్ తీసుకుంది. అనీ మాస్టర్ హోటల్ మేనేజర్ గా నటించింది. ఇక రవి, శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ సర్వీస్ బాయ్స్ గా నటించారు. మిగిలిన ఇంటి సభ్యులు కస్టమర్స్ గా నటించారు. లేడి గెటప్ లో రవి కస్టమర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ కనిపించాడు. ఇక మానస్, ప్రియాంక హనీమూన్ కి వచ్చిన కపుల్స్ గా కనిపించారు. కస్టమర్స్ గా ఉన్న సభ్యులు.. హోటల్ సభ్యులని ఆటపట్టిస్తూ, వారిచేత సేవలు చేయించుకుంటూ వినోదం అందించారు.