ఇటీవల నటీమణులు తమకి ఎదురైన లైంగిక వేధింపులని ధైర్యంగా మీడియా ముందు చెబుతున్నారు. గతంలో మీటూ ఉద్యమం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ రేంజ్ లో కాకున్నా హేమ కమిటీ రిపోర్ట్ పై కూడా బాగానే చర్చ జరుగుతోంది. సింగర్, ప్రముఖ నటి ఆండ్రియా గురించి పరిచయం అవసరం లేదు. ఎలాంటి విషయం గురించి అయినా ఆమె ధైర్యంగా ముఖం మీదే మాట్లాడేస్తుంది.