అజయ్ బెల్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ది లేడీ కిల్లర్ . ఈ మూవీలో హీరో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ దశలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చివరగా నవంబర్ 2023లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1 లక్ష కంటే తక్కువ రాబట్టింది.
లేడీ కిల్లర్ కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు 293 టిక్కెట్లు అమ్ముడైంది. దాని నుండి రూ.38,000 మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా మొత్తం వసూళ్లు లక్ష లోపే రాబట్టడం గమనార్హం.