పదేళ్లగా అతనితో ప్రేమలో ఉన్నా: సాయి పల్లవి

First Published | Sep 4, 2024, 12:40 PM IST

 లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చున్న ఆమె ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. 

Actress Sai Pallavi


 సాయి పల్లవి తెలుగు,తమిళ,మళయాళం అన్ని చోట్లా అభిమానులు ఉన్నారు. అందుకు కారణం కేవలం ఆమె నటనను మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్లటమే.

దానికి తోడు ఆమె రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటూ, గ్లామర్ పాత్రలు అసలు చేయదు. నటనతో పాటు డాక్టర్ కోర్స్ కూడా చేసింది.  అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె అద్బుతమైన డాన్సర్. 
 

Actress Sai Pallavi Movies


సాయి పల్లవి కెరీర్ ప్రారంభంలో టీవీల్లో డాన్స్ షోలులో పాల్గొనేది.  ఈ క్రమంలోనే ఆమెకు  మలయాళంలో ప్రేమమ్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ల్లో ఒకరిగా నటించే అవకాశం వరించింది.

అక్కడ నుంచి ఆమె కెరీర్ నెక్ట్స్ లెవిల్ కు చేరకుంది. ఆ తర్వాత  తన యాక్టింగ్ స్కిల్స్ తో మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా  సౌత్ సినిమానే ఆకట్టుకున్నారు. 



అలా హీరోయిన్ గా ప్రారంభమైన సాయిపల్లవి ప్రస్ధానం ఇప్పుడు బాలీవుడ్‌ వరకు వెళ్లింది. ముఖ్యంగా తెలుగులో అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన ఆమె నెక్ట్స్‌ డోర్‌ అమ్మాయిగా ఇమేజ్‌ను తెచ్చుకుంది.  

లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చున్న ఆమె ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. అలాగే  సాయి పల్లవి.. గత పదేళ్ల నుంచి ఒకతనితో ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. 

actress sai pallavi

సాయి పల్లవి మాట్లాడుతూ.. మహాభారతం ఇతిహాసంపై తనకెంతో గౌరవం ఉందని, అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అభిమన్యుడి గురించి అనేక విషయాలు చదివి తెలుసుకున్నానని..

అలా తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడిపోయానని సాయి పల్లవి తెలిపింది. ఒక‌టి, రెండు కాదు పదేళ్ల నుంచి అభిమ‌న్యుడిని ప్రేమిస్తున్నానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఇక ఆమె లవ్ స్టోరీ గురించి తెలుసుకుని షాక్ అవ్వడం అభిమానుల వంతు అయ్యింది.
 

ఇక తమిళంలోకి వడచెన్నై చిత్రంతో తెరంగేట్రం చేసిన సాయిపల్లవి ఆ తరువాత సూర్యకు జంటగా ఎన్‌జీకే చిత్రంలో నటించారు. ఈమె నటించిన గార్గి చిత్రం మంచి  సక్సెస్ సాధించింది.

తాజాగా ఈమె శివకార్తికేయన్‌ సరసన నటించిన అమరన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా తెలుగులో నాగచైతన్యకు జంటగా తండేల్‌ చిత్రంలో, హిందీలో రామాయణం చిత్రంలో సీతగాను నటిస్తున్నారు. 

Latest Videos

click me!