`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ 6 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. రామ్‌ పోతినేని సినిమాకి షాకింగ్‌ కలెక్షన్లు

Published : Dec 03, 2025, 12:31 PM IST

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటించిన `ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది. ఈ చిత్రం ఆరు రోజులు పూర్తి చేసుకున్నా ఇంకా టార్గెట్‌కి చాలా దూరంలో ఉండిపోయింది.  

PREV
15
థియేటర్లలో `ఆంధ్ర కింగ్‌ తాలూకా` సందడి

రామ్‌ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఆంధ్ర కింగ్‌ తాలూకా`. మహేష్‌ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. ఆయన ఇందులో సినిమా హీరోగా నటించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రం గత గురువారం(నవంబర్‌ 27న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన రాబట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

25
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ బాక్సాఫీసు కలెక్షన్లు

ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే మిశ్రమ స్పందన లభించింది. ఇప్పుడు విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. రోజుకి కోటి, కోటిన్నర మధ్యనే బాక్సాఫీసు వసూళ్లు ఆగిపోయాయి. ఆరు రోజుల్లో ఇది ఇండియాలో కేవలం రూ.17కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.23కోట్ల వరకు వచ్చాయని ట్రేడ్‌ వర్గాల అంచనా. ఈ లెక్కన ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌కి చాలా దూరంలో ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావడానికి సుమారు రూ.55కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. కానీ ఇప్పుడు సగం మాత్రమే వచ్చాయి.

35
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.27కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్‌ని చేరుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి ఉన్నది ఇంకా రెండు రోజులే. బుధవారం, గురువారం మాత్రమే ఈ సినిమాకి ఛాన్స్ ఉంది. శుక్రవారం నుంచి `అఖండ 2` వస్తోంది. ఆల్మోస్ట్ అన్ని థియేటర్లలో ఆ సినిమానే ప్రదర్శిస్తారు. దీంతో `ఆంధ్ర కింగ్‌ తాలూకా`ని ఎత్తేస్తారు. ఆ తర్వాత ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. ఈ లెక్కన రామ్‌ కెరీర్‌లో ఇది మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది.

45
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` పై ఆశలు పెట్టుకున్న రామ్‌

రామ్‌ చివరగా `ఇస్మార్ట్ శంకర్‌`తో హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేశాయి. కానీ `ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇది కూడా డిజప్పాయింట్‌ చేయడం బాధాకరం. అయితే సినిమా పట్ల రామ్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. మంగళవారం ప్రెస్‌ మీట్‌లో కూడా ఆయన తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పది మంది సినిమా చూస్తే 9 మందికి నచ్చింది. కానీ ఆ పది మందే చూశారు, ఇంకా పెరగాల్సి ఉందన్నారు. క్రమంగా ఈ చిత్రం పుంజుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

55
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` కథే ఇదే

ఇక ఈ సినిమా స్టోరీ ఏంటనేది చూస్తే, ఇందులో ఇందులో ఉపేంద్ర స్టార్‌ హీరోగా నటించారు. ఆయనకు అభిమానిగా రామ్‌ కనిపిస్తాడు. అభిమాన హీరో వందవ సినిమా ఆగిపోతుంది. అందుకు మూడు కోట్లు కావాల్సి ఉంది. ఆ మనీ కోసం నిర్మాతలను రిక్వెస్ట్ ఉపేంద్ర. తన కొడుకు సినిమాలో క్యారెక్టర్‌ చేయమని అడుగుతాడు ఓ నిర్మాత. ఇది విని షాక్‌ తిన్న రామ్‌.. తన థియేటర్‌ అమ్మి ఉపేంద్రకి మూడు కోట్లు డబ్బు పంపించడమే సినిమా. అయితే ఆ థియేటర్‌ కథేంటి? దాని వెనుక ఉన్న లవ్‌ ట్రాక్‌ ఏంటనేది సినిమాలో హైలైట్ ఎలిమెంట్ గా చెప్పొచ్చు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ కూడా ఆకట్టుకుంటుంది. రామ్‌ నటుడిగా ది బెస్ట్ ఇచ్చాడు. నవంబర్‌లో రావడంతోనే ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయిందని టీమ్‌ చెప్పడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories