సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన కూలీ చిత్రంతో థియేటర్స్ లో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఆగష్టు 15తో రజినీకాంత్ నటుడిగా 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగష్టు 14న రిలీజ్ అయిన కూలీ చిత్రం రజినీ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా రజినీకాంత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 2024 ఎన్నికల విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడి పవన్ కళ్యాణ్‌ను “ఆంధి”గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
25
పవన్ కళ్యాణ్ పొలిటికల్ తుఫాన్ అంటూ రజినీ కామెంట్స్
తాజాగా రజనీకాంత్, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ను 'పొలిటికల్ తూఫాన్' గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. రజనీకాంత్ ఈ పోస్ట్ లో పవన్ కళ్యాణ్‌ను తన సోదరుడిగా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. 50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న తనకి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కి రజినీ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రియమైన సోదరుడు, పొలిటికల్ తుఫాన్ పవన్ కళ్యాణ్ గారూ.. మీరు అందించిన శుభాకాంక్షలు ఎంతో సంతోషాన్నిచ్చాయి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
35
50 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్న రజినీ
ఇటీవల పవన్ కళ్యాణ్, రజనీకాంత్‌కు తన పార్టీ అధికారిక లెటర్‌హెడ్‌పై ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. రజనీకాంత్ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయనను అభినందిస్తూ, రాబోయే “కూలీ” చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రతిగా రజనీకాంత్ చేసిన స్పందన పవన్ అభిమానులను ఉత్సాహపరిచింది.
కూడా రజనీకాంత్ అభిప్రాయాలకు స్పందిస్తూ, ఆయనను “పెద్ద అన్న”గా సంబోధించారు. ఈ మాటల మార్పిడి, సౌత్ ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్ద స్టార్‌ల అభిమానుల్లో భారీ స్థాయిలో సంతోషాన్ని కలిగించింది.
55
ఉప ముఖ్యమంత్రిగా పవన్
ఇప్పటికే జనసేన అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగానికి మారిన ఆయనను “పొలిటికల్ తూఫాన్”గా రజనీకాంత్ పొగడటం, ఆయన రాజకీయ ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది.