టాలీవుడ్ లో ఒకప్పుడు యాంకరింగ్ అంటే అందరికీ ఉదయభానునే గుర్తుకు వచ్చేవారు. చాలాకాలం ఉదయభాను తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ యాంకర్ గా కొనసాగారు. ఆమె యాంకర్ అయినప్పటికీ హీరోయిన్లని మించే అందంతో చాలామంది అభిమానులని ఉదయభాను సొంతం చేసుకుంది. అయితే కొన్ని విభేదాలు, ఇతర కారణాల వల్ల ఆమె కెరీర్ లో బ్రేక్ తీసుకుంది. అప్పటి నుంచి ఆమెకి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి.