సుమ కనకాల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది. అందులో ఓ వైట్ క్లాత్ తన ముఖంపై వేసుకుని ఇంతకి తానేం చెప్పదలుచుకున్నానంటే అని ఏదో చెప్పబోయింది. ఇంకా మూడు రోజులుందని ఓ వాయిస్ వినిపించడంతో మళ్లీ ఆ క్లాత్ ముఖంపై వేసుకుని పడుకుంది.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేసిందంతా చేసి తడి బట్ట వేసుకుని పడుకుంది సుమ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సరదాగా చేసే ఈ కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.
జులై 1న కొత్తగా సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది సుమ. మరి కొత్తగా ఏదైనా షోకి సంబంధించిన వీడియో విడుదల చేయబోతుందా? లేక తానే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయబోతుందా? అన్నది సస్పెన్స్ లో పెట్టింది. చేసిందంతా చేసిన ఇప్పుడిదేం పని అంటూ ఫ్యాన్స్ సెటైర్లు కురిపిస్తున్నారు.
మరి జులై 1న సుమ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉంటే యాంకర్స్ లో యంగ్ బ్యూటీస్ లైక్.. అనసూయ, రష్మీ, శ్రీముఖి,దీపికా పిల్లి, విష్ణు ప్రియా, వర్షిణి వంటి భామలు ఫోటో షూట్లతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంటారు.
ఇప్పుడీ సీనియర్ యాంకర్ కూడా తానేం తక్కువ కాదంటుంది. వరుసగా ఫోటో షూట్లతో హంగామా చేస్తుంది.
లేటెస్ట్ గా సుమ కనకాల బ్లాక్ డ్రెస్‌లో ఓ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. సుమ అంటే గ్లామర్‌కి దూరం. నిండుతనంతో కూడిన డ్రెస్‌లోనే ఎంతో అందంగా ఉంది సుమ కనకాల.
దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కుర్రభామలే కాదు చివరికి సీనియర్ యాంకర్ కూడా ఫోటో షూట్లతో చంపేస్తుందంటూ పంచ్‌లు వేస్తున్నారు.
పంచ్‌లకు కేరాఫ్‌గా నిలిచే సుమకే పంచ్‌లు పడుతుండటం విశేషం.
సుమ ఓ వైపు `క్యాష్`, మరోవైపు `స్టార్ట్ మ్యూజిక్` వంటి షోలకు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.