Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?

Published : May 28, 2026, 09:57 AM IST

రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు టీమ్. ఈక్రమంలో రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్ ను వెల్లడించింది జాన్వీ.

PREV
15
రిలీజ్ కు రెడీగా రామ్ చరణ్ పెద్ది...

భారీ అంచనాల నడుమ జూన్ 4న రిలీజ్ కాబోతోంది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఈ మూవీలో జాన్వీ కపూర్ హిరోయిన్ గా నటించింది. ఈక్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచేశారు టీమ్. దేశమంతా చుట్టి వచ్చేస్తున్నారు. ఇక  ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ ను ఆమె వెల్లడించింది. చరణ్ తో  డ్యాన్స్ చేయడంపై ఆమె సరదా కామెంట్స్ చేసింది. 

25
రామ్ చరణ్ తో డ్యాన్స్ చేస్తే ఏమౌతుంది?

ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే చాలని జాన్వీ సరదాగా అన్నారు. 'మీ అందరికీ ఒక సింపుల్ వెయిట్ లాస్ టిప్ ఇస్తాను. రామ్ చరణ్ సర్‌తో కలిసి ఆయన పాటల్లో ఒకదానికి డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్క రోజంతా కూడా అవసరం లేదు' అని ఆమె చెప్పారు.'సగం రోజులోనే మీకు తేడా కనిపిస్తుంది అన్నారు. 

35
రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్..

జాన్వీ మాట్లాడుతూ.. ‘’మేము మూడు, నాలుగు రోజులు పాట షూటింగ్ చేశాం. నాలుగో రోజుకి డ్యాన్సర్లందరూ సన్నగా, స్లిమ్ అయినట్లు నాకు అనిపించింది' అని జాన్వీ ఫన్నీ కామెంట్స్ చేసింది. అంతే కాదు రామ్ చరణ్ ఫిట్ నెస్ సీక్రెట్ అదే అని ఇండైరెక్ట్ గా ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఇక ఈసినిమాలో  రామ్ చరణ్ 'పెద్ది' అనే టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా, రొమాన్స్, థ్రిల్ అన్నీ ఉన్నాయి.

45
పెద్ది కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం..

ఈ కథలో క్రికెట్, కుస్తీ, పరుగు పందెం వంటి క్రీడలకు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అభిమానులను ఉత్సాహపరిచే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీని బిల్డ్ చేసుకున్న తీరు, అందుకు ఆయన పడ్డ కష్టం.   కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

55
పెద్ది కోసం మెగా అభిమానుల వెయిటింగ్..
బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read more Photos on
click me!

Recommended Stories