#Jalsa:ఇంకో కథ కావాలా నాయినా..పవన్ ఫ్యాన్స్ ని మళ్లీ తగులుకున్నాడేంటి?

Published : Aug 31, 2022, 06:12 PM IST

 ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లో ‘జ‌ల్సా’కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జ‌ల్సా చిత్రం దాదాపు 500 షోస్‌తో సెప్టెంబ‌ర్ 2న రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ప్రెంచ్ డైరక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
112
 #Jalsa:ఇంకో కథ కావాలా నాయినా..పవన్ ఫ్యాన్స్ ని మళ్లీ తగులుకున్నాడేంటి?
Hbd Pawan kalyan


చెయ్యక ..చెయ్యక ఓ సారి పొరపాటు చేస్తే అది జీవితాంతం వెంటాడేటట్లుంది. తెలుగు లో  ఆకట్టుకునే పదునైన పంచ్ డైలాగ్స్ తో మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథల్లో, సినిమా సీన్లలో చాలా హాలీవుడ్ ఇన్ఫూయిన్స్ లు కనిపిస్తాయి.  తెలుగు పాత సినిమాలు, డైలాగులు అనుకరణ కూడా కనిపిస్తుంది. అయితే అవన్నీ సినిమాలో కలిసిపోయి ..రీ విజిటింగ్ లా అనిపిస్తాయి.
 

212


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  కాంబినేషన్ లో,  పవన్ కళ్యాణ్ 25వ సినిమా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో చిత్రం వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  అభిమానులతో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం సంక్రాంతి సందర్భంగా  ఈ రోజు రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, ల హిట్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి

312

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టాలీవుడ్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పాటు కెరీర్ పరంగా త్రివిక్రమ్ కు ఎన్నడూ లేనంతగా కొంత అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ తరువాత, అంతకముందు ఫ్రెంచ్ భాషలో తెరకెక్కిన లార్గో వించ్ అనే సినిమాను పూర్తిగా మక్కికి మక్కి దించి త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తీశారనే విమర్శలు విపరీతంగా వెల్లువెత్తాయి. 

412


  అంతటితో ఆగకుండా, ఏకంగా లార్గో వించ్ సినిమా దర్శకుడు సైతం తమ సినిమాను కాపీ చేసి తెలుగులో అజ్ఞాతవాసి సినిమా తీశారంటూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే నిజానికి త్రివిక్రమ్, లార్గో వించ్ ని కాపీ కొట్టి తన సినిమాను తీసారా లేదా అనే విషయాన్ని అటుంచితే, ఆ ఘటనల వలన త్రివిక్రమ్ కు కొంత నెగటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత సూపర్ హిట్ తో మళ్ళి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు త్రివిక్రమ్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురములో సినిమా పెద్ద హిట్టైంది. కానీ ఆ డైరక్టర్ మాత్రం మర్చిపోలేదు.

512


మళ్లీ  ఇన్నేళ్ల తర్వాత  'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సల్లే మళ్లీ సీన్ లోకి వచ్చారు.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  సెటైర్ వేసారు.  'జల్సా' స్పెషల్ షోలను ఎగతాళి చేసి వార్తల్లో నిలిచాడు ఫ్రెంచ్ ఫిలిం మేకర్.

612


పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 'జల్సా' 4K వెర్షన్ ను ప్రత్యేకంగా ప్రదర్శించాలని పీకే అభిమానులు ప్లాన్ చేశారు. ఏపీలో 180 స్క్రీన్లలో ‘జల్సా’ ప్రదర్శించబడుతుండగా చాలా చోట్ల హౌజ్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్, దేవీ 70 ఎంఎం, గచ్చిబౌలిలోని ఏఎంబీ, ప్రసాద్ ఐమాక్స్ లోనూ హౌజ్ ఫుల్ అయినట్టు సమాచారం. మహేశ్ బాబు ‘పోకిరి’కి ధీటుగా పవన్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ‘జల్సా’ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ఇందులో భాగంగా ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో కూడా స్పెషల్ షోలను వేయడానికి సన్నాహాలు చేశారు.

712


ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజ్ లో ట్వీట్ చేశారు.ఇంట్రస్టింగ్ గా దీనిపై జెరోమ్ సల్లే స్పందించాడు. 'జల్సా' స్పెసిల్ షోలను ఉద్దేశిస్తూ "కూల్! నేను గిఫ్ట్ తీసుకురావాలా? ఉదాహరణకి స్క్రిప్ట్ లాగా" అని ట్వీట్ చేశాడు.

812


'అజ్ఞాతవాసి' సినిమా కోసం తన కథని కాపీ చేశారని జెరోమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రాన్ని వెటకారం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. తనకు ఈ సినిమాతో ఏ విధంగానూ సంబంధం లేదు కానీ.. త్రివిక్రమ్ - పవన్ కలిసి చేసిన మూవీ కావడంతో ఆయన ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారని అర్దమైంది.

912


ఆ డైరక్టర్ ఈ సెటైర్ కు  #PowerStarBirthday అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించడమే కాదు.. పవన్ కళ్యాణ్ ను కూడా ట్యాగ్ చేశాడు. జెరోమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పీకే ఫ్యాన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ తోనే మర్చిపోలేని సినిమా వచ్చింది.. ఇంకా నువ్వు ఎలాంటి బహుమతులు ఇవ్వొద్దు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

1012
Hbd Pawan kalyan

 
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ అభిమానుల కోరిక మేరకు ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పెషల్ షోస్ గాను మూవీ టీం ఆన్లైన్ లో టికెట్లని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన కొద్దిసేపటికే టిక్కెట్లు అమ్ముడుపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ అభిమానులు అయితే అదీ పవన్ రేంజ్ అంటూ వారి అభిమాన నటుడు గురించి చెప్పుకుంటున్నారు.

1112


 తమ అభిమాన నటుడిని వెండితెరపై చూసుకుని ఏడాది కావడంతో ఈ స్పెషల్ షోస్ తో అభిమానాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్పెషల్ షోస్ తో వచ్చిన కలెక్షన్ లని ఛారిటీకి ఇస్తున్నట్టుగా అభిమాన సంఘాలు వెల్లడించాయి.

1212

`జల్సా` సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్‌లో సుమారు నలభై లక్షలున్నట్టు తెలుస్తుంది. రేపటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ చిత్రం కోటీకిపైగా కలెక్షన్లు రాబట్టేఛాన్స్ ఉంది. కేవలం హైదరాబాద్‌ సిటీలోనే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఏపీలో, నైజాంలో, ఓవర్సీస్‌లో ఈ రచ్చ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. థియేటర్ల హోనర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఇది ఇంకెన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. అభిమానుల రచ్చ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories