అదిరిపోయే డ్రెస్ లో బుల్లితెర రాములమ్మ జబర్దస్త్ ఫోజులు.. నిషా కళ్లతో మత్తెక్కించేస్తున్న శ్రీముఖి..

First Published | Jul 1, 2023, 2:16 PM IST

బుల్లితెర రాములమ్మగా గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి (Sreemukhi) వరుస ఫొటోషూట్లతో గ్లామర్ క్వీన్ గా మారుతోంది. పద్ధతిగా మెరుస్తూనే పదునైనా చూపులు, ఫోజులతో కుర్ర హృదయాలను దోచుకుంటోంది. 
 

‘పటాస్’ కామెడీషోతో శ్రీముఖి యాంకర్ గా ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తొలిషోతోనే తన టాలెంట్ చూపించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరుస షోలతో ఫుల్ బిజీగా మారింది.
 

బ్యాక్ టు బ్యాక్ షోలతో టీవీ ఆడియెన్స్ ను అలరిస్తూనే వస్తున్నారు శ్రీముఖి. చలాకీతనం, యాంకరింగ్ స్కిల్స్ తోపాటు ఎప్పకటిప్పుడు నయా లుక్స్ లో మెరుస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తన క్రేజ్ మరింతగా పెంచుకుంటున్నారు.
 


స్మాల్ స్క్రీన్ పై మెరుస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ శ్రీముఖి సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. మరోవైపు తన షోకు సంబంధించిన లేటెస్ట్ లుక్స్ లోనూ దర్శనమిస్తూ మతులు పోగొడుతున్నారు. 
 

తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో శ్రీముఖి మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే గ్లామర్ మెరుపులతోనూ, అదిరిపోయే ఫోజులతోనూ ఆకట్టుకుంటోంది.

గ్రీన్ కలర్ ఫుల్ గౌన్ లో బుల్లితెర రాములమ్మ చక్కగా కనిపిస్తోంది. చూడగానే హృదయాలను దోచుకునేలా మెరిసింది. మరోవైపు మత్తు చూపులు, ఆకర్షించే రూపసౌందర్యంతో ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. 

శ్రీముఖిని ఫ్యాన్స్ , నెటిజన్లు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. తను పోస్టు చేసే ఫొటోలను లైక్స్, కామెంట్లతో క్షణాల్లోనే వైరల్ చేస్తున్నారు. ఇక తాజా ఫొటోషూట్ ను ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కోసం చేసింది. వచ్చే ఎపిసోడ్ లో తన లుక్ ను ముందే ఇలా రివీల్ చేసింది.
 

ఇదిలా ఉంటే శ్రీముఖి వెండితెరపైనా అలరిస్తున్న విషయం తెలిసిందే. మొదట సినిమాల్లోనే సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. యాంకర్ గానే మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఇప్పటికే ‘క్రేజీ అంకుల్స్’ అనే చిత్రంలో హీరోయిన్ గా మెరిసింది. మరిన్ని చిన్నచిన్న సినిమాల్లోనూ ఆయా పాత్రల్లో అలరించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - తమన్నా భాటియా జంటగా నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!