ఆవిషయంలో.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ పై ట్రోలింగ్.. ఘాటుగా స్పందించిన నటి?

First Published | Jul 1, 2023, 12:39 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) కొద్దిరోజులుగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె చేసిన పనికి పలువురు విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా స్టార్ కిడ్ ఘాటుగా, సరిగా బదులిచ్చినట్టు తెలుస్తోంది. 
 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురుగా సారా అలీఖాన్ వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. సారా 2018లో వచ్చిన ‘కేదార్నాథ్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించి మెప్పించింది. 
 

తొలిచిత్రంతోనే సారా మంచి గుర్తింపు దక్కించుకుంది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంటోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 
 


ఇదిలా ఉంటే సారా ఇటు షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే.. సమయం దొరికితే టూర్లు, వెకేషన్లకు వెళ్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అలాగే పలు దేవాలయాలనూ సందర్శిస్తుంటారు. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోలనూ అభిమానులతో పంచుకున్నారు. 
 

ఈ క్రమంలో సారా అలీఖాన్ ట్రోలింగ్ కు గురవుతోంది. ముస్లిం అమ్మాయి అయ్యి ఉండి కూడా హిందూ దేవాలయాలను ఎలా సందర్శించారంటూ కొందరు ట్రోల్ చేశారు. అయితే అందులో తప్పేముందని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా సారా అలీఖాన్ స్పందించినట్టు తెలుస్తోంది. 
 

సారా స్పందించిన దాని ప్రకారం.. తనపై వస్తున్న ట్రోల్స్ తనలోని భక్తిని వ్యక్తపరచడాన్ని అడ్డుకోలేదన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకున్న తను ఆలయాలకు వెళ్లకుండా ఉండనని చెప్పారంట. వ్యక్తిగత విషయాలను ఎలా జడ్జ్ చేస్తారని ఘాటుగా స్పందించారంట. ఈ ట్రోలింగ్ ను తను అస్సలు పట్టించుకోనని బదులించారని తెలుస్తోంది.
 

బాలీవుడ్ లో ప్రస్తుతం సారాఅలీ ఖాన్ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘జర హట్కే జర బచ్కే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రంతో నెక్ట్స్ అలరించబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
 

Latest Videos

click me!