యాంకర్ గా స్పెషల్ ప్రోగ్రామ్‌లకు శ్రీముఖి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్. `కామెడీ స్టార్స్`, మా టీవీ ప్రోగ్రాములు, జీ తెలుగు స్పెషల్ ప్రోగ్రాములు, ఈటీవీ పండుగ ఈవెంట్లలో శ్రీముఖినే సందడి చేస్తుంటుంది. చలాకీతనం, కొంటెతనం, చురుకుతనం, మంచి గ్లామర్, మంచి వాయిస్, నవ్వు ఫేస్ శ్రీముఖి అసెట్స్ . స్టేజ్‌పై ఈ బ్యూటీ కనిపించిందంటే ఆడియెన్స్ అలా చూస్తూ ఉండిపోతుంటారు. అందుకే ఇప్పుడు స్పెషల్‌గా యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి.