Poorna: వింటేజ్‌ లుక్‌లో నడువొంపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. అందాల ఘాటు మామూలుగా లేదుగా

First Published | Nov 10, 2021, 5:07 PM IST

`ఢీ` పూర్ణ.. పైకి కనిపించదు కానీ ఆమె అందాల వేడి మామూలుగా ఉండదు. అదొక్క నెటిజన్లకి మాత్రమే తెలుసు. ఈ బ్యూటీ పంచుకునే గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తుంటాయంటే అది అతిశయోక్తి కాదు. 
 

పూర్ణ (Poorna) నటిగానే మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు తన యాక్టింగ్‌ని అనేక రకాలుగా విస్తరించుకుంటుంది. గ్లామర్‌ని, నటనని తనకు అనుగునంగా మలుచుకుంటుంది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తూనే, నటిగా పెద్ద తెరపై కనువిందు చేస్తుంది. జనరల్‌ ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేస్తుంది.  ఇప్పుడు సోషల్‌ మీడియాలో అత్యంత క్రేజ్‌ ఉన్న నటీమణుల్లో పూర్ణ ఒకరు కావడం విశేషం. పూర్ణ పంచుకునే ఫోటోలు గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్‌ రాబట్టుకుంటుండటం విశేషం. పూర్ణ ఫోటో షూట్‌ పిక్స్ కి నెట్టింట బోలెడు డిమాండ్‌ ఉండటంతో తాను కూడా గ్లామర్ షోకి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు పూర్ణ. Poorna Glamour Photos.

తాజాగా హాట్‌ షో విషయంలో పంథా మార్చింది. ఈ రోజు పంచుకున్న పూర్ణ గ్లామర్‌ ఫోటోలు అన్ని రకాల ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. అభిమానులను ఫిదా చేస్తున్నాయి. అయితే వింటేజ్‌ లుక్‌లో పూర్ణ కనిపించడం ఇప్పుడు స్పెషాలిటీగా మారింది. పల్లెటూరి అమ్మాయిగా ముస్తాబై కనువిందు చేస్తుంది. బ్లూ కలర్‌ శారీ, జడలో పూలు పెట్టుకుని పూర్ణ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేసేస్తున్నాయి. ఆమె మాయలో పడేస్తున్నాయి.  Poorna Glamour Photos.


పూర్ణ ప్రతి వారం తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుని నెటిజన్లకి దగ్గరవుతుంది. వారిని ఖుషీ చేస్తుంది. సోషల్‌మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాలను చూపిస్తూ ఈ బ్యూటీ ఇచ్చే ఫోటో షూట్‌ ఫోటోలు సైతం తెగ వైరల్‌ అవుతుంటాయి. దీంతో ఆటోమెటిక్‌గా అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది పూర్ణ.  Poorna Glamour Photos.

పూర్ణ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు రాకపోయినప్పటికీ నటిగా మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. అయితే సెకండ్‌ గ్రేడ్‌ హీరోయిన్‌ మాదిరిగా, విభిన్న కథా చిత్రాలకు, విభిన్నమైన పాత్రలకు, ముఖ్యంగా కాస్త బోల్డ్ గా ఉండే పాత్రలకు పూర్ణ బెస్ట్ ఆప్షన్‌గా మారిపోతుంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ అలాంటి సినిమాలే కావడం విశేషం.  Poorna Glamour Photos.

ఆ మధ్య విడుదలైన `సుందరి`లోనూ బోల్డ్ రోల్‌ చేసింది. భర్త చేత హింసించబడ్డ మహిళగా, దాన్ని ఎదుర్కొని నిలబడే మహిళగా పూర్ణ నటన అబ్బురపరిచింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. మరోవైపు `తలైవి` చిత్రంలో శశికళ పాత్రలో కనువిందు చేసింది. ఇప్పుడు `బ్యాక్‌ డోర్‌` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  Poorna Glamour Photos.

దీంతోపాటు `3రోజెస్‌` అనే `ఆహా` ఒరిజినల్‌లోనూ నటిస్తుంది. పాయల్‌ రాజ్ పుత్‌, ఈషా రెబ్బాలతో కలిసి నటిస్తుంది. ఇందులో పొట్టి దుస్తుల్లో పూర్ణ తెగ సందడి చేస్తుంది. అందాల విందుని వడ్డిస్తూనే నటిగా తనలోని కొత్త యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేయబోతుంది పూర్ణ. మరోవైపు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు `ఢీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అందాల ఫోటోలను పంచుకుని సోషల్‌ మీడియా అభిమానులను విందు భోజనం పెడుతుంది. మొత్తంగా అన్ని రకాలుగా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది పూర్ణ. Poorna Glamour Photos.

Latest Videos

click me!