తడి కురులు.. వెలిగిపోతున్న రూపం.. పండగ వేళ జాన్వీ కపూర్ క్యూట్ సెల్ఫీలు

Sreeharsha Gopagani | Published : Sep 18, 2023 1:35 PM
Google News Follow Us

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పండగవేళ మరింత అందంగా మెరిసింది. బ్యూటీఫుల్ సెల్ఫీలతో  కట్టిపడేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ  పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

16
తడి కురులు.. వెలిగిపోతున్న రూపం.. పండగ వేళ జాన్వీ కపూర్ క్యూట్ సెల్ఫీలు

అతిలోక సుందరి, దివంగ శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయా చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 

26

ఇక సోషల్ మీడియాలో మాత్రం అందాల విందుతో దుమారం రేపుతూనే.. ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ సెల్ఫీలను అభిమానులతో షేర్ చేసింది.
 

36

ఈరోజు గణేశ్ చతుర్థి కావడంతో కొన్ని బ్యూటీఫుల్ సెల్ఫీలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. గణనాథుడి దీవెనలు పొందండి అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. 

Related Articles

46

మరోవైపు ఫ్యాన్స్,, నెటిజన్లు కూడా జాన్వీకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపుతున్నారు. ఇక పండగవేళ యంగ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ కూడా అందించిందంటూ పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటీఫుల్ క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

56

బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ బ్యూటీ త్వరలో తెలుగు ప్రేక్షకులనూ వెండితెరపై పలకరించబోతోంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.
 

66

ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే జాన్వీ ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Read more Photos on
Recommended Photos