అందాల యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ సెన్స్ వేరే లెవల్.. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బుల్లితెర బ్యూటీ..

Published : Jul 25, 2022, 11:20 AM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) గ్లామర్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర రాములమ్మగా ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. క్రేజీ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది.

PREV
18
అందాల యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ సెన్స్ వేరే లెవల్.. స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బుల్లితెర బ్యూటీ..

టాలెంటెడ్ యాంకర్ శ్రీముఖి టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.  అందం, నైపుణ్యం కలిగిన ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది.  
 

28

‘పటాస్’ కామెడీషోతో బుల్లితెర రాములమ్మగా పేరొందిన శ్రీముఖి, లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ యూత్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ మేరకు స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ నెటిజన్లను, తన అభిమానులను ఖుషీ చేస్తోంది.

38

శ్రీముఖి ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగానే ఉండేందుకు ప్రయత్నిస్తోంది. బుల్లితెర యాంకర్ గా బిజీ అయినా.. ఫాలోవర్స్ ను ఫిదా చేసేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కనువిందు చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది.

48

తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్లు నెటిజన్లను అట్రాక్ట్ చేసింది.  ట్రెండీ వేర్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్న అందాల యాంకర్ కుర్రాళ్లను తొలిచూపులోనే పడగొడుతోంది. కిర్రాక్ పోజులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

58

ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ ను ఫాలోవర్స్, నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. క్రేజీగా కామెంట్లు సైతం పెడుతూ  శ్రీముఖిని ఎంకరేజ్ చేయడమే గాకా పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ బ్యూటీ వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చేసిన ఫొటోషూట్ మాత్రం ‘స రి గ మ ప’ సింగింగ్ రియాలిటీ షో కోసం చేసింది.
 

68

చాలా రోజుల తర్వాత యాంకర్ గా శ్రీముఖికి దక్కిన మరో అవకాశం ‘స రి గ మ ప’ సింగింగ్ రియాలిటీ షో. ప్రతి ఆదివారం ‘జీ తెలుగు’లో ఈ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.  షోకు శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందున ప్రతి ఎపిసోడ్ కు ట్రెండీ లుక్ లో ఫొటోషూట్లు చేస్తోంది.

78

ఇలా గ్లామర్ షో చేస్తూనే తన టీవీ ప్రొగ్రామ్స్ ను చక్కగా ప్రమోట్ చేసుకుంటోంది. ‘స రి గ మ ప’షోకు ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉంది. నిన్న ప్రసారమైన లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ఇలా ఫొటోషూచేసిందీ బ్యూటీ.

88

శ్రీముఖి కేరీర్ కు ప్రస్తుతం దూసుకుపోతోందనే చెప్పాలి. ఇటు టీవీషోలతో పాటు.. కొన్ని ఈవెంట్లకు కూడా ఈ బ్యూటీ హాజరవుతోంది. అలాగే బిగ్ స్క్రీన్ పైనా స్టార్ హీరోల  సినిమాల్లో ఆయా పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో ఈ బ్యూటీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.  
 

Read more Photos on
click me!

Recommended Stories