ఎన్టీఆర్ డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల సత్యనారాయణ, ఆయన పక్కనే విలన్‌గా నటించే స్థాయికి ఎలా ఎదిగారు...

Published : Jul 25, 2022, 10:59 AM IST

Kaikala Satyanarayana: టాలీవుడ్‌ ఎందరో గొప్ప నటులను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది. వారిలో ఎలాంటి పాత్రనైనా ఇట్టే చేయగలవారు మాత్రం అతి కొద్ది మంది ఉంటారు... అలాంటి అరుదైన నటుల జాబితాలో ‘నవరస నటనా సార్వభౌమ’  కైకాల సత్యనారాయణ పేరు కచ్ఛితంగా ఉంటుంది. కైకాల సత్యనారాయణ గారి 87వ పుట్టినరోజు నేడు...

PREV
115
ఎన్టీఆర్ డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల సత్యనారాయణ, ఆయన పక్కనే విలన్‌గా నటించే స్థాయికి ఎలా ఎదిగారు...

క్రూరత్వం పండించే విలన్‌గా, నవ్వులు పూయించే కమెడియన్‌గా, సెంటిమెంట్‌తో ప్రేక్షకులను ఏడిపించగల సీరియస్ నటుడిగా... అన్ని రకాల పాత్రల్లో కనిపించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు కైకాల సత్యనారాయణ. 

215

సీనియర్ ఎన్టీఆర్‌కు డూప్‌గా ఎంట్రీ ఇచ్చిన కైకాల సత్యనారాయణ, ఆ తర్వాత ఆయన పక్కనే విలన్‌గా నటించే స్థాయికి ఎదిగారు.

315

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని కావుతరం గ్రామంలో జన్మించిన కైకాల సత్యనారాయణ,. గుడివాడ కాలేజీలో డిగ్రీ దాకా చదివారు. 

415

1959లో ‘సిపాయి కూతురు’ సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు సత్యనారాయణ. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోవడంతో ఎన్టీ రామారావుకు డూప్‌గా నటించారు... 

515

సీనియర్ ఎన్టీఆర్‌కి తగ్గ ఎత్తూ, కాయం ఉండడంతో చాలా సినిమాల్లో ఆయనకు డూప్‌గా కనిపించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ ద్విపాత్రినయం చేసిన చాలా సినిమాలను జాగ్రత్తగా గమనిస్తే, కైకాల సత్యనారాయణ కనిపిస్తారు...

615

ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం, త్రిపాత్రాభియనం చేసిన చాలా సినిమాల్లో సత్యనారాయణ ఆయనకు డూప్‌గా నటించారు. అలా సత్యనారాయణలోని నటుడిని గుర్తించిన ఎన్టీఆర్, ‘అపూర్వ సహస్ర సచ్ఛరిత్ర’ సినిమాలో సత్యనారాయణకు ఓ వేషం ఇప్పించారు. 

715

ఆ తర్వాత ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘లవకుశ’లో భరతుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనుడిగా, ‘శ్రీకృష్ణ పాండవీడయం’ సినిమాలో ఘటోత్కచుడిగా, ‘యమలీల’ సినిమాలో యముడిగా... ఇలా విభిన్నమైన పౌరాణికి పాత్రల్లో సత్యనారాయణ అభినయం, ఆయన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. 

815

తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ... 1977లో ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ వంటి ఆల్‌టైం బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సినిమాను నిర్మించారు...

915

కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘కే.జీ.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ‘చాఫ్టర్ 1’ కి సహ నిర్మాతగా వ్యవహారించిన కౌకాల సత్యానారయణ... ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో సత్యనారాయణగారు నటించలేదు.

1015

2011లో ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ దక్కించుకున్న సత్యనారాయణ, 2017లో ‘ఫిల్మ్ ఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్’ అవార్డు దక్కించుకున్నారు. 

1115

84 ఏళ్ల వయసులోనూ నందమూరి ఎన్టీ రామారావు తనయుడు బాలకృష్ణ కోరిక మేరకు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో కనిపించారు కైకాల సత్యనారాయణ...

1215

2019లో విడుదలైన మహేశ్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’లో చివరిగా ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించారు కైకాల సత్యనారాయణ...

1315

తన కెరీర్‌లో దాదాపు 750 సినిమాలకు పైగా నటించిన కైకాల సత్యనారాయణ, ‘నవరస నటనా సార్వభౌముడి’గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు...

1415

‘యమగోల’ సినిమాలో ‘యముండా...’ అంటూ కైకాల సత్యనారాయణ చెప్పే డైలాగ్, నిజంగా యమధర్మరాజు అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేంతగా తెలుగువారికి చేరువైంది...

1515

‘యమగోల’ సూపర్ హిట్ అయిన తర్వాత ‘యముడికి మొగుడు’, ‘యమలీల’ వంటి సినిమాల్లో యమ ధర్మరాజు పాత్రలో కనిపించిన కైకాల సత్యనారాయణ, రవితేజ హీరోగా వచ్చిన ‘దరువు’, శ్రీకాంత్ ‘యమగోల మళ్లీ మొదలైంది’ సినిమాల్లోనూ సీనియర్ యముడిగా కనిపించారు.

Read more Photos on
click me!

Recommended Stories