Hi Nanna Ott : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

Published : Dec 30, 2023, 02:16 PM ISTUpdated : Dec 30, 2023, 02:17 PM IST

నేచురల్ స్టార్ నాని Nani లేటెస్ట్ ఫిల్మ్ ‘హాయ్ నాన్న’Hi Nanna’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఇదే నెలలో విడుదలైన చిత్రం ఓటీటీకి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. 

PREV
16
Hi Nanna Ott : ‘హాయ్ నాన్న’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేస్తున్నారు. రోటీన్ భిన్నంగా కథలను ఎంచుకుంటూ తన అభిమానులు, ఆడియెన్స్ ను వెండితెరపై అలరిస్తున్నారు. చివరిగా ‘దసరా’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ Hi Nannaతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

26

వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సరసన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  నటించింది. తండ్రి కూతురి గురించి చెప్పిన ఈ చిత్రంలో బేబీ కియారా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. శౌర్యూ దర్శకత్వం వహించారు. 

36

చిత్రం ప్రేక్షకుల నుంచి కాస్తా పాజిటివ్ టాక్ నే దక్కించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు దక్కించుకోలేదు. డీసెంట్ హిట్ అనిపించుకుంది. రూ.40 కోట్లు పెట్టిన ఈ చిత్రానికి రూ.70 కోట్ల వరకు తిరిగి వచ్చినట్టు తెలుస్తోంది. 

46

అయితే ఈ సినిమాను ఎక్కువ మంది థియేటర్లలో కంటే ఓటీటీ వీక్షించేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. నాని ‘హాయ్ నాన్న’ మూవీ ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ Ott Releaseకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ Netflix డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. 

56

తాజాగా మూవీ ఓటీటీ రిలీజ్ పై నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. జనవరి 4 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అయితే చిత్రం థియేటర్లలో విడుదలైనే నెలలోపే ఓటీటీలోకి వస్తుండట విశేషంగా మారింది. 

66

ఇక నాని ‘హాయ్ నాన్న’ మూవీ ప్రమోషన్స్ ముగించారు. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘హిట్3’లోనూ నటించబోతున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories