అదిరింది షో విషయంలో నాగబాబు చేసిన మోసం బయటపెట్టిన యాంకర్... వైరల్ అవుతున్న కామెంట్స్!

First Published Jan 21, 2021, 10:00 AM IST


జబర్ధస్త్ నుండి బయటికి వచ్చిన నాగబాబు ఆ షోకి పోటీగా జీతెలుగులో అదిరింది పేరుతో ఓ కామెడీ షో ప్రారంభించిన సంగతి తెలిసిందే. జబర్ధస్త్ కి పోటీ ఇవ్వడమే కాకుండగా ,  జబర్ధస్త్ షోని పడగొడతాం అని నాగబాబు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ షోకి యాంకర్ గా సమీరా షరీఫ్ ని తీసుకోవడం జరిగింది. 
 

అప్పటి వరకూ పెద్దగా ఎవరికీ పరిచయం లేని సమీరా... అదిరింది షోలో యాంకర్ గా కనిపించారు. తమ ఆట పాటలతో, గ్లామర్ తో  ఏళ్లుగా అలరిస్తున్న రష్మీ, అనసూయకు సమీరా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
undefined
యాంకర్ సమీరా వలన షోకి పెద్దగా ప్రయోజనం లేదని భావించిన నాగబాబు... పది ఎపిసోడ్స్ కూడా పూర్తి కాకుండగానే ఆమె షో నుండి తప్పించడం జరిగింది. హఠాత్తుగా ఓ యాంకర్ ని షో నుండి తప్పించడం హాట్ టాపిక్ అయ్యింది. సమీరా సైతం దీనిపై నోరు విప్పలేదు.
undefined
అయితే తాజా ఇంటర్వ్యూలో నాగబాబు తనకు చేసిన అన్యాయం బయటపెట్టింది. మొదట 25 ఎపిసోడ్స్ కి తనతో అగ్రిమెంట్ చేయించుకున్నారట నాగబాబు. అయితే ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తూ తనను 10ఎపిసోడ్స్ లోపే షోనుండి తప్పించారని ఆవేదన చెందారు.
undefined
తనను షో నుండి తప్పిస్తున్నట్లు కనీసం తెలియపరచలేదు. అలాగే తనను తీసేయడం వెనుక కారణం ఏమిటో కూడా తెలియజేయలేదని సమీరా ఆవేదన చెందారు.
undefined
షో అనుకున్నంత సక్సెస్ కాకపోవడం వలనే నన్ను తొలగించివుంటారని ఆమె అన్నారు. అదిరిందికి చెప్పుకోదగ్గ ఆదరణ దక్కడం లేదు. అందుకే ఎపిసోడ్స్ కూడా ప్రసారం కావడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
undefined
జబర్ధస్త్ షో నుండి బయటికి వచ్చిన నాగబాబు... జబర్ధస్త్ నిర్మాతలపై అనేక ఆరోపణలు చేశారు. అగ్రిమెంట్స్ పేరుతో శ్రమను దోచుకున్నారని, తక్కువ రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారని ఆరోపించారు. అలా అన్న నాగబాబే సమీరా విషయంలో ఇలా చేయడం తప్పే అనాలి.
undefined
జబర్ధస్త్ డైరెక్టర్స్ తో పాటు కమెడియన్స్ ని తనతో తెచ్చుకున్న నాగబాబు, ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది. అదిరింది, బొమ్మ అదిరింది రెండు షోలు బొక్క బోర్లా పడ్డాయి. ఈ మధ్య ఈ ఎపిసోడ్స్ ప్రసారం కూడా కావడం లేదు.
undefined
దీనితో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో  యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే తన యూట్యూబ్ ఛానల్ లో స్టాండప్ కామెడీ షో ప్రారంభించారు.  అడల్ట్ కంటెంట్ కామెడీతో సక్సెస్ కావాలని చూస్తున్నారు.
undefined
ఈ షోలో కమెడియన్స్ మాట్లాడిన బూతులపై వ్యతిరేకత రాగా.. నాగబాబు సమర్ధించుకున్నారు. యూట్యూబ్ అనేది నచ్చినవారు మాత్రమే చూసే మీడియం, మీకు నచ్చకపోతే చూడకండి, స్టాండప్ కామెడీలో బూతులు కామన్ అని కొట్టిపారేశారు.
undefined
click me!