యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు గొప్ప మనసు.. సింగర్‌కి ఆ‌ ఫీజు మొత్తం చూసుకుంటానని ప్రామిస్‌.. ఫ్యాన్స్ ప్రశంసలు

Published : Jan 21, 2021, 08:59 AM IST

యాంకర్‌ ప్రదీప్‌ బుల్లితెర షోలలో తనదైన చలాకీతో, కామెడీతో ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటున్నాడు. తనదైన యాక్టింగ్‌, యాటిట్యూడ్‌తో అమ్మాయి మనసులను దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఓ సింగర్‌కి సహాయంచేస్తానని చెప్పి టోటల్‌ ఆడియెన్స్ తోపాటు, సాధారణ ప్రజల మనసులను గెలుచుకున్నాడు. నిజమైన అన్నయ్య అనిపించుకుంటున్నాడు. 

PREV
110
యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు గొప్ప మనసు.. సింగర్‌కి ఆ‌ ఫీజు మొత్తం చూసుకుంటానని ప్రామిస్‌.. ఫ్యాన్స్ ప్రశంసలు
జీతెలుగులో వచ్చే `సరిగమప` పాటల ప్రోగ్రామ్‌కి యాంకర్‌ ప్రదీప్‌ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ ప్రోమో ఇది.

210
ఇందులో పవన్‌ కళ్యాణ్‌ అనే సింగర్‌ అద్భుతమైన పాటలు పాడి అలరిస్తున్నారు. శ్రోతల మనసులను గెలుచుకుంటున్నాడు. అయితే అతని ఫ్యామిలీ ఎన్నో కష్టాలు పడి తనకి సపోర్ట్ చేస్తుంది.

310
అయితే స్టేజ్‌పై పాట పాడిన తర్వాత ఆ సింగర్‌కి సర్‌ప్రైజ్‌ చేస్తూ తన తండ్రిని, అలాగే తనకు అన్న విధాలుగా సపోర్ట్ చేస్తున్న టీచర్‌ని స్టేజ్‌పైకి తీసుకొచ్చారు.

410
దీంతో ఆ కుర్రాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆనందంతో తండ్రిని హగ్‌ చేసుకున్నాడు. తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

510
ఈ సందర్బంగా సింగర్‌ పవన్‌ కళ్యాణ్‌ నాన్న చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌ చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, ఆ డ్రైవింగ్‌తోనే తనని గాయకుడిగా ప్రోత్సహించారని, ఇప్పటికీ ఆ డ్రైవింగ్‌తోనే తమ కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పాడు.

610
దీంతో అక్కడున్న వారంతా ఎమోషన్‌ అయ్యారు. ప్రదీప్‌తోసహ, జడ్జెస్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

710
అంతేకాదు తన గురువు కూడా తనని చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. తనకి సంబంధించిన అన్ని ఆయనే సలహాలిస్తారని బ్యాక్‌బోన్‌గా ఉన్నారని చెప్పి వాహ్‌ అనిపించారు.

810
సింగర్‌ పవన్‌ కళ్యాణ్‌ మాటలకు యాంకర్‌ ప్రదీప్‌ ఎమోషనల్‌ అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ తండ్రికి పెద్ద కొడుకుని అవుతానని చెప్పి ఓదార్చాడు. అంతటితో ఆగలేదు.. పవన్‌ కళ్యాణ్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యేంత వరకు అయ్యే కాలేజ్‌ ఫీజులు తానే భరిస్తానని హామి ఇచ్చారు.

910
దీంతో `సరిగమప` వేదిక మొత్తం కరతార ధ్వనులతో మోగిపోయింది. ఇంతర సింగర్స్ మొత్తం లేచి నిలబడి క్లాప్‌ కొట్టారు. ఈ ఆదివారం జీతెలుగులో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విశేషంగా ఆకట్టుకుంటుంది.

1010
అంతేకాదు ప్రదీప్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నా నువ్వు రియల్‌ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. అన్నట్టు ప్రదీప్‌ హీరోగా మారి `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. ఇందులో `నీలి నీలి ఆకాశం.. `పాట మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్‌ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories