అక్టోబర్ నుంచి రంగంలోకి పవన్ కళ్యాణ్... తోడుగా కమల్ హాసన్ కూడా..?

First Published | Aug 11, 2024, 11:48 AM IST

ఎలక్షన్స్ అయిపోయాయి.. ప్రభుత్వం కుదురుకుంటోంది.. ఇక రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంతే కాదు ఈసారి తోడుగా లోక నాయకుడు కమల్ హాసన్ కూడా వస్తున్నాడట. ఇంతకీ విషయం ఏంటి..? 

సినిమా రాజకీయాలు రెండింటిని బ్యాలన్స్ చేస్తూ వెళ్ళాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరీ ముఖ్యంగా ఎవరు పడలేని మాటలు పడ్డాడు. అయినా సరే గెలుపే లక్ష్యంగా పనిచేసి.. చివరకు అనుకున్నది సాధించాడు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ. అయితే ఎలక్షన్ హడావిడిలో ఆయన కమిట్ అయిన మూడు సినిమాలు.. సగం షూటింగ్ లోనే ఆపేశాడు.. దాంతో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి అనేది అభిమానుల ప్రశ్న. 
 

All So Read: రీరిలీజ్ లో కూడా రికార్డ్ బ్రేక్ చేసి మహేష్ బాబు, మురారి ఎంత రాబట్టిందంటే..?

గెలుపు జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఆమూడు సినిమాలు కంప్లీట్ చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా, పంచాయితీరాజ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవర్ స్టార్.. ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. తన శాఖపై పట్టు తెచ్చకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోతే సినిమాలను కూడా ఆయన కంప్లీట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఈ అక్టోబర్ నుంచే ఆయన సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. అటు డ్యూటీతో పాటు.. ఇటు సినిమాలకు కూడా కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ కేటాయించబోతున్నారట. 

All So Read:  తరుణ్ నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్న అక్కినేని హీరో ఎవరు..?


అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న మూడు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. సుజిత్ తో ఓజి, క్రిష్ స్టార్ట్ చేసి వదిలేసిన హరిహరవీరమల్లు సినిమాలు పెడ్డింగ్ లో ఉన్నాయి. ఇక రీసెంట్ గా హరీహరవీరమల్లు నుంచి కొత్త పోస్టర్ కూడా వదిలారు. అందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ జాయిన్ కాబోతున్నాడు. ఇక ఈమూడు సినిమాల షూటింగ్స్  అక్టోబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

All So Read:  రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు

ఇక వీటితో పాటు.. పవన్ కళ్యాణ్ ‌- సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో.. గతంలో కమిట్ అయ్యి.. ఆగిపోయిన సినిమా కూడా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డికి మాటిచ్చిన పవన్ అది నిలబెట్టుకోబోతున్నాడట. అందుకోసం అక్టోబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమాకు సబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నట్టు  తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. 

All So Read: 42 ఏళ్ళ వయస్సులో తగ్గేదిలేదంటున్న స్నేహా.. జిమ్ లో కుమ్మేస్తుందిగా

ఈసినిమా కోసం ఇప్పటికే ఆయనన్ను సంప్రదించాడట సురేందర్ రెడ్డి. అయితే ఆయన కూడా ఈ క్యారెక్టర్ గురించి విని ఎంతో ఉత్సాహం చూపించినట్టు సమాచారం. అక్టోబర్ లోనే సినిమా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఉన్న టైమ్ ను తన సినిమాలకోసం అడ్జెస్ట్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. ఇక దర్శకులు కూడా పవన్ కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారట. ఇలా రాగానే అలా స్టార్ట్ చేసి.. బ్రేక్ లేకుండా.. పనిచేయాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే..అక్టోవర్ వరకూ ఆగాల్సిందే. 

Latest Videos

click me!