మరొక సందేశంలో.. ''సమంత నువ్వు బాధపడకు. నీ కోసం నేను ఉన్నాను. రెండేళ్లలో నేను డబ్బులు సంపాదిస్తా. నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం '', అని కామెంట్ పోస్ట్ చేశాడు. ఈ కామెంట్స్ కి సమంత స్పందించింది. సదరు అభిమాని వీడియోను ఉద్దేశిస్తూ ''నీ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తున్న జిమ్ నన్ను కన్విన్స్ చేస్తుంది'' అని రిప్లై ఇచ్చింది. సమంత రియాక్షన్ చూశాక, ఆమెలో రెండో వివాహం పట్ల అనుకూల భావాలు మొదలయ్యాయి. నాగ చైతన్య కంటే ముందు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం కలదంటున్నారు జనాలు...