స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ లక్షల సంపాదన కలిగి ఉన్నారు. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ ఇల్లు ఉంది. ఆర్థికంగా సెటిల్ అయిన రష్మీ దుర్భరమైన రేకుల షెడ్డుకు మారిందట. ఈ విషయం తెలిసిన జనాలు అవాక్కు అవుతున్నారు .
రష్మీ గౌతమ్ టాప్ యాంకర్స్ లో ఒకరు. జబర్దస్త్ వేదికగా ఆమె భారీ ఫేమ్ రాబట్టింది. గ్లామరస్ యాంకర్ ఇమేజ్ తో రష్మీ కెరీర్ లో దూసుకుపోతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె తన మార్క్ యాంకరింగ్ తో అలరిస్తున్నారు.
26
రష్మీ మరో ప్రక్క నటిగా రాణిస్తుంది. ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే పెద్దగా సక్సెస్ లు రాలేదు. ఈ మధ్య హీరోయిన్ ఆఫర్స్ తగ్గాయి. అయితే తన ఇమేజ్ కి తగ్గట్లు పాత్రలు దక్కుతున్నాయని సమాచారం. భోళా శంకర్ లో ఆమె తళుక్కున మెరిశారు.
36
రష్మీ ఆర్థికంగా సెటిల్ అని చెప్పాలి. కెరీర్ బిగినింగ్ లో హాస్టల్ లో అనేక కష్టాలు పడ్డట్లు ఆమె వెల్లడించారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న రష్మీ ఆస్తి కోట్లకు చేరింది. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ ఉంది. ఖరీదైన కార్లు ఉన్నాయి.
46
rashmi Instagram
మరి ఇంత సంపద ఉన్న రష్మీ గౌతమ్ కనీస అవసరాలు లేని రేకుల షెడ్డుకు ఎందుకు మారింది. ఈ విషయాన్ని హైపర్ ఆది స్వయంగా రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు రష్మీ హౌస్ చూద్దామన్న హైపర్ ఆది, స్క్రీన్ మీద ఓ రేకుల షెడ్డు చూపించాడు.
56
Rashmi Gautam
అయితే ఇదంతా కామెడీలో భాగమే. సెలెబ్స్ ఆస్తుల గురించి యూట్యూబర్స్ తమకు ఇష్టం వచ్చిన ఫోటోలు, థంబ్ నెయిల్స్ జోడించి వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాళ్లకు కౌంటర్ గా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని ఫోటోలు ప్రదర్శించాడు.
66
Rashmi Gautam
జడ్జి ఇంద్రజ పూరి గుడిసెలో ఉంటున్నట్లు, రష్మీ రేకుల షెడ్ లో, ఇక హైపర్ ఆది స్లమ్ ఏరియాలో ఉంటున్నట్లు ఫోటోలు స్క్రీన్ పై ప్రదర్శించగా షోలో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.