బాలయ్య వెడ్డింగ్ కార్డ్ చూశారా..? బాలకృష్ణ పెళ్లి పత్రికలో స్పెషల్ ఏంటంటే..?

Published : Feb 27, 2024, 12:11 PM IST

నందమూరి నట సింహం బాలయ్య బాబు  పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుసా..? వసుందరా దేవి మెడలో బాలకృష్ణ మూడుముళ్ళు వేసింది ఏ ఊరిలో నో తెలుసా..? నటసింహం పెళ్లి ముహూతర్తం ఎన్నిగంటలకు.. ప్రస్తుతం వైరల్ అవుతున్న పెళ్లి పత్రిక స్పెషల్ ఏంటంటే..? 

PREV
16
బాలయ్య వెడ్డింగ్ కార్డ్ చూశారా..? బాలకృష్ణ పెళ్లి పత్రికలో స్పెషల్ ఏంటంటే..?

నంద‌మూరి నట సింహం బాలయ్యా బాబు. పెద్దాయన నందమూరి తారక రామారావు  న‌ట‌వారసుడిగా  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయిన హీరో నంద‌మూరి బాల‌కృష్ణ. ఎన్టీఆర్ కు ఇంకా కుమారుల‌ున్నా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది మాత్రం బాలయ్య బాబే.  టాలీవుడ్ లో తనకంటూ  చెర‌గ‌ని ముద్ర‌వేసుకుని.. తన సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని.. అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య. 

26

హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో  తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్న బాల‌య్య... కెరీర్ బిగినింగ్ నుంచి  ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించి బాలయ్య.. ఆతరువాతి కాలంలో మాస్ ఆడియన్స్ ను ఊర్రూతలూగించారు. ఫ్యాషన్ సినియమాలతో దడదడలాడించారు. హైఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు బాలకృష్ణ. 

36

ఇక చాలా కాలంగా బాలయ్య ఫ్యాన్స్ ఆయన వారసుడి కోసం ఎదరుచూస్తున్నారు. రీసెంట్ గా తన లుక్ ను కంప్లీట్ గా ఛేంజ్ చేశారు మోక్షజ్ఞ. త్వరలో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఉంటందని సంకేతాలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం బాలయ్య కు సబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

46

బాల‌య్య పెళ్ళికి సబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య వసుందరాదేవి పెళ్లి చేసుకున్నప్పటి వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలకృష్ణ పెళ్ళి టైమ్ కు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్ బిజీగా ఉన్న టైమ్ లోనే వసుందర తో బాలకృష్ణ పెళ్లి కుదిరిందట. బాలయ్య భార్య వారి బంధువులే అని సమాచారం. 

56

బాలయ్య వెడ్డింగ్ కార్డ్ లో పెళ్లి ఎక్కడ జరిగింది.. ముహూర్తం ఏప్పుడు అనేది క్లియర్ గా ఉంది. తిరుపతిలో పెళ్ళి జరగ్గా.. బుదవారం మధ్యాహ్నంముహూర్తంలో పెళ్లి జరిగింది. అయితే ప్రస్తుంతం వైరల్ అవుతున్న ఈకార్డ్ నందమూరి వారిది కాదు. వసుందరా దేవి పుట్టింటి వారి పెళ్లి కార్డ్ కావడం విశేషం. 

66

 వ‌సుంద‌ర దేవి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త దేవుర‌ప‌ల్లి సూర్యారావు. ఇక 1982 డిసెంబ‌ర్ 8న వ‌సుంద‌ర దేవి బాల‌య్య వివాహం జ‌రిగింది. ఇక ప్ర‌స్తుతం వీరి పెళ్లి శుభ‌లేఖ నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీరి పెళ్ళి తిరుపతిలోని కర్నాటక మండపంలో జరిగినట్టు అందులో ఉంది. చాలా సింపుల్ గా..  ఉన్న ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories