మహేష్ బాబుతో సినిమాకు నో చెప్పిన యాంకర్ రష్మీ, గుంటూరు కారం అలా మిస్ అయ్యిందా...?

First Published | Feb 12, 2024, 7:43 AM IST

మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వస్తే.. ఎవరైనా నో చెపుతారా..? ఎగిరి గంతేసి మరీ ఎస్ అంటారు. కాని యాంకర్ రష్మీ గౌతమ్ మాత్రం నో అనేసిందట.  అదేంటి అలా ఎలా అంటుంది అని మీకు డౌట్ రావచ్చు... కాని విషయం ఏంటంటే..? 
 

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బుల్లితెరపై ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఒక యాంకర్ కు ఈ రేంజ్ లో క్రేజ్ అంటే.. ఈజీగా వచ్చేది కూడా కాదు. ఆమె ఈ పొజిషన్ కోసం చాలా కష్టపడింది. కాంపిటేషన్ ఉన్న తన టాలెంట్ నిరూపించుకుంది. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన రష్మీ గౌతమ్.. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ రోల్స్ చేసి.. ఆతరువాత యాంకర్ గా సెటిల్ అయ్యింది. 

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా వరుసషోలు చేస్తూ.. దడదడలాడిస్తోంది రష్మి. జబర్థస్త్ తో పాటు.. శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్సెషల్స్ తో  ఆడియన్స్ ను అలరిస్తోంది. ముఖ్యంగా జబర్థస్త్ కు చాలా ఏళ్ళ నుంచి యాంకర్ గా రష్మీ నడిపిస్తోంది. అనసూయ రెండు సార్లు జబర్థస్త్ మానేసినా.. రష్మీ మాత్రంకంటీన్యూ చేస్తోంది. 


rashmi Instagram

ఇక యాంకరింగో పాటు సోషల్ మీడియాలో కూడా రష్మీ ఫాలోయింగ్ మామూలుగాఉండదు మరి. ఆమె హాట్ హాట్ అందాల ఆరబోతతతో ఇన్ స్టా గ్రామ్ నిండిపోయి ఉంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. ఫ్యాన్స్ కోసం అదరిపోయే అందాలు చూపిస్తూ.. సందడి చేస్తుంటుంది బ్యూటీ. ఇక  వీటితో పాటు రష్మీ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంటుంది. 
 

ఇక తాజాగా రష్మీ గౌతమ్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ మిస్అయ్యిందట.  సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చినా.. మిస్ చేసుకుందట. నేను చేయను అని చెప్పేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు గుంటూరు కారం. ఈమూవీలో ఛాన్స్ ను రష్మీ ఎందుకు మిస్ చేసుకుందో తెలుసా..? 

గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. సినిమా పెద్దగా జనాలకు నచ్చకపోయినా..ఈసాంగ్ మాత్రంయమా పాపులర్ అయ్యింది. రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. తమన్ అందించిన ట్యూన్ అంతట రచ్చ చేస్తోంది.  ఈ పాటలో హీరోయిన్ పూర్ణ కూడా కొంత వరకూ కనిపిస్తుంది. కనిపించిన కొంత కూడా స్టెప్పులతో అదరగొట్టింది. ఇక పూర్ణ ప్లేస్ లో రష్మీ నటించాల్సి ఉందట. 

ఈ పాట అనుకున్నప్పుడు పూర్ణ చేసిన పాత్ర కోసం  ముందు రష్మీనే అనుకున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతే కాదు త్రివిక్రమ్ టీమ్ ఆమెను సంప్రదించారట కూడా. అయితే సాంగ్ మొత్తం అయితే చేయవచ్చు కాని..ఇలా రెండు మూడు బిట్ల వరకూ అయితే తాను చేయనని చెప్పేసిందట. దాంతో దర్శకుడు పూర్ణనుసంప్రదించగా.. ఆమె ఒకే అనేసిందట. అలా రష్మీ మిస్ చేసుకున్న అవకాశాన్ని పూర్ణ పట్టేసింది. 
 

నిజానికిపూర్ణనే ఈసాంగ్ కు కరెక్ట్ గా సెట్ అయ్యింది  అంటున్నారు ఆడియన్స్. ఇక సంక్రాతి కానుకగా రిలీజ్అయిన  గుంటూరు కారం మంచి విజయం అందుకుంది. ఈసినిమాతో పోటీ పడిన హనుమాన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ సక్సెస్ ను సాధించింది. 

Latest Videos

click me!