ఇక ఇన్ స్టాలో వరుస ఫోటో షూట్లతోసందడి చేస్తుంది స్నేహారెడ్డి. ఇక మొదటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు స్నేహారెడ్డి. ఇన్ స్టాలో తనకు సబంధించిన విషయాలతో పాటు.. తన ఫ్యామిలీ ఫోటోస్ కూడా అప్ డేట్ చేస్తుంటారు.
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్ళి చేసుకుని.. హ్యాపీ లైఫ్ ను గడుపుతున్న మోస్ట్ బ్యూటీపుల్ కపుల్స్ లో అల్లు అర్జున్ జంట కూడా ఉన్నారు. బన్నీ ఇండస్ట్రీకి సబంధంలేని అమ్మాయిని ప్రేమించి పెళ్లాడారు. స్నేహారెడ్డితో పెళ్లి.. ఇద్దరు పిల్లలు..వాళ్లు కూడా పెద్దవాళ్లు అవుతున్నారు. కాగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అయిన తరువాత స్నేహారెడ్డి మోడలింగ్ పై దృష్టి పెట్టారు.
బన్నీ ఇంట్లో ఎలా ఉంటారు.. పిల్లలతో ఎలా ఆడుకుంటారు.. పిల్లలు ఎలా అల్లరి చేస్తారు.. పండగలు ఎలా సెలబ్రేట్ చేస్తాము.. ఇలా రకరకాల వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తుంటారు. అంతే కాదు పిల్లలను చూసుకోవిడంతో పాటు.. బన్నీకి సబంధించిన విషయాలు కూడా చాలా కేర్ ఫుల్ గా ఉంటారట స్నేహారెడ్డి.
ఇక ఈక్రమంలో స్నేహారెడ్డికి సంబంధించిన మరో విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్నేహాలో మెడలింగ్ తో పాటు మరో హిడెన్ టాలెంట్ కూడా ఉందట. అదేంటంటే.. స్నేహారెడ్డి మంచి సింగర్ అని తెలుస్తోంది. ఆమె బేసిక్ మ్యూజిక్ కూడా నేర్చుకుందని అంటున్నారు.
పాటలు బాగా పాడతారని.. బన్నీ సినిమాలో పాటలు కూడా పాడతారని నెట్టింట ఓ న్యూస్ వైరల్అవుతుంది. అయితే ఆమెబయట ఎక్కడా పాడింది లేదు కాని.. ఇంట్లో జరిగే అకేషన్స్ లో మాత్రం సరదాగా తన టాలెంట్ ను బయటపెడతారట. మరి ఈ మోడలింగ్ విషయంలో ఎలా అయితే తన టాలెంట్ బయట పెట్టారో.. సింగింగ్ విషయంలో కూడా స్నేహారెడ్డి అలానే ఏదో ఒక రోజు ప్రంపంచానికి పరిచయం చేస్తారేమో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆమె పాడితే వినాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.