ఎంత కష్టపడినా ఎదగాలంటే అది కావాల్సిందే... రష్మీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్!

Published : Apr 10, 2024, 08:45 AM IST

యాంకర్ రష్మీ గౌతమ్ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్నాక రష్మీ గౌతమ్ కి హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. కాగా పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలు ఆమె వెల్లడించారు.   

PREV
17
ఎంత కష్టపడినా ఎదగాలంటే అది కావాల్సిందే... రష్మీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్!
Rashmi Gautam

రష్మీ గౌతమ్ తెలుగు అమ్మాయి కాదు. వారిది ఒరిస్సా. అయితే వైజాగ్ లో పెరిగింది. రష్మీకి తెలుగు సరిగా రాదు. అయినా తన గ్లామర్, క్యూట్ మాటలతో యాంకర్ గా నిలదొక్కుకుంది. జబర్దస్త్ కామెడీ షో ఆమె ఫేట్ మార్చేసింది. 

27

జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన పాపులారిటీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు తెచ్చిపెట్టింది. పదికి పైగా చిత్రాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా చేయడం విశేషం. అయితే చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. దాంతో బ్రేక్ రాలేదు. కాగా స్టార్ యాంకర్ గా బుల్లితెర మీద దూసుకుపోతుంది. 

 

 

37
Rashmi Gautam

ఇక పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలు రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చిన రష్మీ చాలా ఇబ్బందులు పడ్డారట. టాలీవుడ్ లో అడుగుపెట్టేనాటికి ఆమెకు వయసు కేవలం 14 ఏళ్ళు మాత్రమేనట. 

47

పైగా రష్మీకి తండ్రి లేడు. సింగిల్ పేరెంట్ సంరక్షణలో కెరీర్ లో ముందుకు వెళ్లడం చాలా కష్టం అయ్యిందని అన్నారు. రష్మీకి కొన్ని చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయట. అయితే ఆమె సన్నివేశాలు తొలగించేవారట. సినిమా విడుదలయ్యాక రష్మీ గౌతమ్ చాలా నిరాశ చెందేవారట. 

57

మనం ఎంత కష్టపడినా పరిశ్రమలో ఎదగాలంటే మరొకరి సపోర్ట్ ఉండాల్సిందే అని రష్మీ గౌతమ్ అన్నారు. పరిశ్రమలో అడుగు పెట్టే నాటికి తనకు ఎలాంటి అవగాహన లేదట. 

 

67
rashmi Instagram

ఇక తనపై తరచుగా దుష్ప్రచారం జరుగుతూ ఉంటుందట. సదరు కామెంట్స్ కి కృంగిపోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనట. లేదంటే కెరీర్ లో ఎదగడం కష్టమే అని ఆమె అన్నారు. రష్మీ గౌతమ్ పై తరచుగా నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. పలు విషయాల్లో ఆమెను టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

77
photo credit - rashmi instagram

ప్రస్తుతం రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. కాగా సుడిగాలి సుధీర్ తో ఆమె ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కానీ మేమిద్దరం స్నేహితులు మాత్రమే అని పలుమార్లు వారు వెల్లడించారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories