జగపతిబాబు షాకింగ్ కామెంట్స్, త్రివిక్రమ్ ని తిట్టడం మొదలెట్టారు

First Published Apr 10, 2024, 7:38 AM IST

తనపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడల్లా ఆడియన్స్‌కి దెబ్బేయడం గురూజీకి మొదటనుంచి ఉన్న అలవాటే. ఈ ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఆ కోవలోదే అంటూ మరోసారి తిట్టిపోస్తున్నారు.

Trivikram, Jagapathi babu


 సంక్రాంతి కానుకగా విడుదలైన  గుంటూరు కారం రిజల్ట్  థియేటర్ లో యావరేజ్ గా నమోదైంది. మహేష్ బాబు కాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అయ్యేదంటారు.  అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమైన ఈ చిత్రంలో  శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా చేసారు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ దీనిని నిర్మించారు. 


 ఈ సినిమాకు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే సంక్రాంతి సీజన్ ,మహేష్ మేనియా కాపాడేసింది. సోషల్ మీడియా జనం సినిమా డిజాస్టర్ అన్నారు కానీ స్టార్ కానీ నటీనటులు కానీ సినిమా వాళ్లు కానీ కామెంట్ చేయటానికి ధైర్యం చేయలేదు. కానీ జగపతిబాబు స్ట్రైయిట్ గా మనస్సులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమా తనకు నచ్చలేదని డైరక్ట్ గా చెప్పేసి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో గుంటూరు కారంతో పాటు, త్రివిక్రమ్ కూడా మరోసారి చర్చకు వచ్చారు. త్రివిక్రమ్ ని మరోసారి అందరూ తిట్టిపోయటం మొదలెట్టారు. 
 


రిలీజ్ కు ముందు గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో  తన పాత్ర గురించి జగపతి బాబు ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూస్తే కనీసం జగపతి బాబుకు ఓ ఐదారు సీన్లు కూడా సరైనవి లేవు. ఇక మహేష్ బాబు జగపతి బాబు సీన్లు అయితే ఏ మాత్రం దారుణంగా ఉన్నాయి.  తాజాగా జగపతి బాబు గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడాడు. మహేష్ బాబుతో తనకు ఎప్పుడూ పని చేయాలనే కోరిక ఉంటుందని, కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే.. గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని అన్నారు.
 


 జగపతిబాబు మాట్లాడుతూ... ‘‘మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడూ ఇష్టమే. కానీ, నిజం చెప్పాలంటే ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా. అందులో కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేది. క్యారెక్టరైజేషన్‌ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో సినిమాను ముగించడం కొంచెం కష్టమైంది. నా పాత్ర కోసం నేను చేయాల్సిందంతా చేశాను. మహేశ్‌తో చేసిన మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంటా. ఆయన చిత్రాల్లో ఏ అవకాశాన్నీ వదులుకోను. ‘శ్రీమంతుడు’ నాకు అద్భుతమైన అనుభవాన్ని అందించింది’ అని చెప్పారు. 
 

గుంటూరు కారం పై జగపతిబాబు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు జగపతిబాబుని సపోర్ట్ చేస్తూ..కరెక్ట్ గా చెప్పాడంటూంటే, మరికొందరు మాత్రం ఆ సినిమాలో పని చేసి ఇలా కామెంట్స్ చేయటం పద్దతి కాదు అంటన్నారు. మరికొందరు త్రివిక్రమ్ ని తిట్టిపోస్తున్నారు. అలాగే నిర్మాత నాగవంశీ ఇప్పుడు ఏమంటాడు..సోషల్ మీడియా జనాలపై అయితే మండిపడ్డాడు..ఇప్పుడు జగపతిబాబుని ఏమన్నా అనగలడా అని దెప్పుతున్నారు. ఏదైమైనా ఎక్కువ శాతం మాత్రం త్రివిక్రమే టార్గెట్ అయ్యారు. 

Mahesh Babus Guntur Kaaram

ఇక తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను కొన్ని అనవసరమైన చిత్రాలు చేశాను. కథను ఎంచుకోవడంలో పొరపడ్డాను. నాకు కమర్షియల్‌ మైండ్‌ లేదు. ఈతరహా కథలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ఏ సినిమా నచ్చితే అది చేశాను. ఒకవేళ అలా చేయకపోయి ఉంటే ఇంకా మంచి స్థానంలో ఉండేవాడినేమో. అయినా నేనేం బాధపడడం లేదు’ అన్నారు.

Mahesh Babus Guntur Kaaram


 
మరోప్రక్క గుంటూరుకారం చిత్రం ఓటిటిలో దుమ్ము దులిపింది. అతి తక్కువ టైమ్ లో ఓటిటిలో వచ్చేయటం ఫ్యాన్స్ కు బాధ కలిగించినా అక్కడ వ్యూయర్ షిప్ చూసి షాక్ అయ్యారు. నెట్ ప్లిక్స్ వారు రికార్డ్ రేటుకు ఓ రీజనల్ సినిమాని కొన్నారు. మహేష్ కెరీర్ లోనూ ఓటిటి కు ఎక్కువ అమ్ముడైన చిత్రం ఇదే. ఈ నేపధ్యంలో ఓటిటిలో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ సినిమాని అనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

గుంటూరు కారం నెట్ ప్లిక్స్ లో దుమ్ము రేపింది. మల్టిపుల్ లాంగ్వేజ్ లలో రిలీజైన ఈ చిత్రం టాప్ 10 లో ట్రెండింగ్ లో ఉంది. అలాగే తెలుగు వెర్షన్ సైతం నెంబర్ 1 పొజీషన్ లో ట్రెండ్ అయ్యింది. హిందీ వెర్షన్ ...3 ప్లేస్ లోనూ, తమిళ వెర్షన్ 5 వ పొజీషన్ లోనూ ట్రెండ్ అయ్యింది. అతి తక్కువ టైమ్ లోనే ఈ సినిమా వ్యూయర్ షిప్ ట్రెండింగ్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్ మేనియా ఇదే అంటున్నారు ఫ్యాన్స్ . 


 వాస్తవానికి గుంటూరు కారం తొలి ఆట నుంచే డివైడ్  టాక్  తెచ్చుకుంది. అయినా  మహేష్ మేనియాతో వ‌సూళ్ల‌లో మాత్రం ఓ రేంజిలో  దూసుకుపోయింది. దానికి తోడు  హ‌నుమాన్ మిన‌హా మిగిలిన సంక్రాంతి సినిమాల‌ు ఏవీ పోటి ఇవ్వకపోవటం గుంటూరు కారంకు  క‌లిసివ‌స్తోంది. మహేష్ బాబు ఛార్మ్,ఫ్యామిలీలలో ఆయనకు ఉన్న  ఫాలోయింగ్ బాగా వర్కవుట్ అవుతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మార్క్ సెంటిమెంట్ ఫ్యామిలీలకు నచ్చుతోంది.  ఈ నేపధ్యంలో టిక్కెట్ రేట్లు కాస్త తగ్గి ఫ్యామిలీలు మరింత గా థియేటర్ కు వెళ్తారు అనుకున్న టైమ్ లో ఓటిటి రిలీజ్ అయ్యింది. 


ఈ సినిమా లో కథ ఎలా ఉన్నా...‘అన్నం వ‌ద్ద‌నుకున్న‌వాడు  రోజంతా ప‌స్తులుంటాడు, అమ్మ‌ని వ‌ద్ద‌నుకున్న‌వాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ త‌న బిడ్డ‌ల‌కి ఏం చేసింద‌ని అడ‌గ‌కూడ‌దు’, ‘త‌ద్దినం జ‌న్మ‌దినం రెండూ దినాలే’ త‌ర‌హా సంభాష‌ణ‌లు ఆకట్టుకున్నాయి. అలాగే  మాస్  పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ,  మాస్ పాట‌లు,  ఇంట్రవెల్ సీన్స్ , క్లైమాక్స్ సీన్స్ లో ఎమోషన్స్  ఇవే ఈ సినిమాకు బలం.
 

click me!