షోలో సునామి సుధాకర్ పై ఫైర్ అయిన రష్మీ... ఇప్పుడు దిగుతుంది అంటూ మాస్ వార్నింగ్!

Published : Aug 08, 2022, 05:26 PM IST

ఎప్పుడూ కూల్ గా ఉండే యాంకర్ రష్మీ గౌతమ్ కి మండించింది. తనపై పంచ్ వేసిన సునామి సుధాకర్ కి మాస్ వార్నింగ్ ఇచ్చింది. దిగుతుంది అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.   

PREV
17
షోలో సునామి సుధాకర్ పై ఫైర్ అయిన రష్మీ... ఇప్పుడు దిగుతుంది అంటూ మాస్ వార్నింగ్!
Jabardasth


రష్మీ గౌతమ్ ప్రమోషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. అనసూయ వెళ్లిపోవడంతో ఆమె బాధ్యత కూడా రష్మీనే భుజాన వేసుకున్నారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ కి కామన్ యాంకర్ గా రష్మీ గౌతమ్ మారారు. ఒంటి చేత్తో లెజెండరీ కామెడీ షోస్ ని నడిపించనున్నారు. 

27
Jabardasth


అనసూయ(Anasuya) స్థానంలో కొత్త యాంకర్ వస్తుందని భావించిన ప్రేక్షకులకు ఒకింత నిరాశే ఎదురైంది. ఏళ్ల తరబడి అనసూయ, రష్మీలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులు కొత్త అందం కోరుకున్నారు. మల్లెమాల అనూహ్యంగా రష్మీని రంగంలోకి దించి షాక్ ఇచ్చారు. కొత్త యాంకర్ సెట్ కాకపోతే మొదటికే మోసం వస్తుందని వారు భావించి ఉండవచ్చు. 
 

37
Jabardasth

సినిమా ఆఫర్స్ కూడా లేని రష్మీ(Rashmi Gautam) టెలివిజన్ షోస్ నే నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఆమెకు జబర్దస్త్ యాంకర్ గా కూడా అవకాశం రావడంతో ఫుల్ ఖుషీలో ఉంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్స్ గా ఆమె జీతం డబుల్ కానుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుడిగాలి సుధీర్ తప్పుకోగా.. ఆ షో యాంకర్ గా కూడా రష్మీనే వ్యవహరిస్తున్నారు. 
 

47
Jabardasth


ఇక జబర్దస్త్(Jabardasth) యాంకర్ గా ఫస్ట్ ఎపిసోడ్ పూర్తి చేసిన రష్మీ... రెండో ఎపిసోడ్ కి సిద్ధమయ్యారు. ఆగస్టు 11న జబర్దస్త్ సెకండ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కాగా ఈ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన అందంపై పంచ్ వేసిన సునామి సుధాకర్ టీమ్ కి ఆమె మాస్ వార్నింగ్ ఇచ్చారు. 
 

57
Jabardasth


సునామీ సుధాకర్ రష్మీ అందాన్ని ఉద్దేశిస్తూ... అది విస్కీనా? రమ్మా?.. చూస్తుంటేనే కిక్ వస్తుంది, అని అన్నాడు. దానికి ఆ పక్కనే ఉన్న కమెడియన్ దగ్గరగా చూడు దిగిపోద్ది అంటూ... రష్మీ వైపుకు సుధాకర్ ని నెట్టాడు. ఆ పంచ్ కి రష్మీ నొచ్చుకుంది ఇప్పుడు మీకు దిగుతుంది అంటూ కౌంటర్ వేసింది. రష్మీకి సుధాకర్ టీం వేసిన పంచ్ కోపం తెప్పించినట్లు స్పష్టంగా అర్థమైంది. 
 

67
Jabardasth


గతంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్స్ రష్మీపై దారుణమైన పంచ్లు వేసేవారు. అయినా ఆమె పెద్దగా రియాక్ట్ అయ్యేవారు కాదు. సుధాకర్ టీం మెంబర్ వేసిన చిన్నపాటి పంచ్ కి కూడా ఆమె కోప్పడడం విశేషం. 
 

77
Jabardasth


ఇదిలా ఉంటే జబర్దస్త్ నుండి సింగర్ మను కూడా తప్పుకున్నారేమో అనిపిస్తుంది. ఆ జడ్జి సీటులోకి వారానికి ఒకరు వస్తున్నారు. తాజా ఎపిసోడ్ జడ్జిగా నటి ప్రగతి వచ్చారు. అలాగే కుష్బూ సైతం అప్పుడప్పుడూ వస్తున్నారు. ఇంద్రజ మాత్రమే ప్రతి ఎపిసోడ్లో కనిపిస్తున్నారు. గతంలో జబర్దస్త్ లో ఇలాంటి మార్పులు ఉండేవి కావు. 

Read more Photos on
click me!

Recommended Stories