మెరిసిపోయే అందంతో కట్టిపడేస్తున్న రష్మీ గౌతమ్.. ఫ్రంటూ బ్యాక్ చూపిస్తూ స్టార్ యాంకర్ పోజులు!

First Published | Jan 24, 2023, 6:54 PM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. 
 

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆయా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చిన రష్మీగౌతమ్ స్టార్ యాంకర్ గానే కాకుండా ప్రస్తుతం హీరోయిన్ గానూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్ రష్మీకి మంచి ఇమేజ్ దక్కింది. తనదైన యాంకరింగ్ స్కిల్స్, చలాకీతనంతో అనతి కాలంలోనే స్టార్ యాంకర్ గా మారిపోయింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. 
 


మరోవైపు బుల్లితెరపై నిర్వహించే ఆయా స్పెషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. అదేవిధంగా రష్మీ గౌతమ్ తన అందంతోనూ యూత్ లో యమా క్రేజ్ దక్కించుకుంది. 

ఇటు సోషల్ మీడియాలోనూ ఆమె ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్లలో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.
 

ఆ ఫొటోలను కూడా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అట్రాక్టివ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తన అందం, కవ్వించే సొగసుతో కుర్రాళ్లను, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

తాజాగా బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చిందీ బ్యూటీ.  బ్లాక్ స్లీవ్ లెస్ టాప్, వైట్ చున్నీలో మెరిసింది. టాప్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మరోవైపు మత్తు చూపులు, మైకం తెప్పించే పోజులతో యువతను చిత్తు చేసింది. 

ప్రస్తుతం రష్మీ పంచుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటు నెటిజన్లు కూడా రష్మీని కావాల్సినంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. తను పంచుకునే ఫొటోలపై పొగుడుతూ కామెంట్లు పెడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలను పంచుకుంటూ ‘షో మస్ట్ గో ఆన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రెండురోజుల కింద రష్మీ నానమ్మ కన్నుమూశారు. దీంతో ఇలా క్యాప్షన్ ఇచ్చిదని తెలుస్తోంది.

ఇటు హీరోయిన్ గానూ వెండితెరపై అలరిస్తోంది. ‘గుంటూరు టాకీస్’,‘అంతం’, ‘నెక్ట్స్ నువ్వే’,‘అంతకు మించి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!