ఆ అపార్ట్మెంట్ చాలా లక్కీ అంట. ఈ భవనం కట్టిన తర్వాతే పివి ప్రధాని అయినట్లు తెలుస్తోంది. ఆ మధ్యన పివి కుమార్తె ఈ భవనాన్ని మైత్రి మూవీస్ సంస్థకి అద్దెకి ఇచ్చారు. ఈ భవనంలో తమ ఆఫీస్ ప్రారంభించిన తర్వాత మైత్రి సంస్థకి తిరుగులేకుండా పోయింది. పీవీ నరసింహారావు అపార్ట్మెంట్ లో ఆఫీస్ ప్రారంభించిన తర్వాతే ఉప్పెన, వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్స్ మైత్రి సంస్థకి దక్కాయట.