లాస్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆమె ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చారు. మరోసారి ఆమె అబ్బాయిని కన్నారు. మొదటి సంతానంగా లాస్యను ఒక అబ్బాయి. పెద్దబ్బాయికి ఆరేడేళ్లు ఉంటాయి. గతంలో సెకండ్ చైల్డ్ గురించి అడుగుతుంటే కోపం వస్తుందని లాస్య అన్నారు. దాంతో ఇకపై ఆమె పిల్లల్ని కనరని అభిమానులు భావించారు.
26
Lasya Manjunath
లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించినవాడితో పెళ్ళికి లాస్య తండ్రి అంగీకరించలేదట. దీంతో ఆమె చాలా కాలం పేరెంట్స్ తిరస్కరణకు గురయ్యారట. తమకు ఓ బిడ్డ పుట్టాక పేరెంట్స్ దగ్గరయ్యారని లాస్య చెప్పుకొచ్చింది.
36
Lasya Manjunath
ఇక యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన లాస్య బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యారు. మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలో లాస్య వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరం అయ్యారు. తర్వాత సడన్ గా బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షం అయ్యారు.
46
Lasya Manjunath
హౌస్ లో లాస్య తన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా ఆమె కంటెస్టెంట్స్ కి రుచికరమైన భోజనం వండి పెడుతూ ఉండేవారు. అందరితో ఆమె సన్నిహితంగా మెలిగేవారు. చాలా తక్కువ సందర్భాల్లో లాస్య సహనం కోల్పోయారు.
56
Lasya Manjunath
అదే సమయంలో ఈమె కూడా ఓ గ్రూప్ మైంటైన్ చేశారు. అభిజిత్, హారిక, నోయల్, లాస్య ఓ జట్టుగా ఉండేవారు. వీరిలో ఒకరైన అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అందుకున్నారు. అభిజీత్ టైటిల్ గెలవడంతో లాస్య ఆనందం వ్యక్తం చేశారు.
66
Lasya
కానీ లాస్య ఫైనల్ కి వెళ్లలేకపోయారు. టైటిల్ రేసులో ఉంటుందనుకుంటే లాస్య అంచనాలు అందుకోలేదు. ఆమెది ఫేక్ స్మైల్ అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హోస్ట్ నాగార్జున కూడా లాస్యను ఫేక్ స్మైల్ అన్నారు. అది కూడా మైనస్ అయ్యింది. బుల్లితెర మీద లాస్య సందడి తగ్గింది. అప్పుడప్పుడు అడపాదడపా షోలలో ఆమె కనిపిస్తున్నారు. లాస్యకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియోలు చేస్తుంటారు.