శేఖర్, నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దన్న రాకేష్ మాస్టర్... ఈ గురు శిష్యులకు ఎక్కడ చెడింది!

Published : Jun 18, 2023, 08:09 PM IST

శేఖర్ మాస్టర్ టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడు. సొంత అన్నదమ్ముల కంటే ఆప్యాయంగా మెలిగిన వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అందుకు కారణాలు ఏంటో చూద్దాం...   

PREV
16
శేఖర్, నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దన్న రాకేష్ మాస్టర్... ఈ గురు శిష్యులకు ఎక్కడ చెడింది!
Rakesh Master Shekar Master


ఒక పూట తిండికి ఇబ్బంది పడే స్థాయిలో రాకేష్ మాస్టర్ వద్దకు శేఖర్ మాస్టర్ వచ్చాడట. శేఖర్ టాలెంట్ చూసిన రాకేష్ మాస్టర్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. తన అసిస్టెంట్ చేసుకుని డాన్స్ నేర్పాడు. అవకాశాలు వచ్చేలా చేశాడు. కష్టనష్టాల్లో ఇద్దరూ తోడున్నారు. అయితే శేఖర్ స్టార్ గా ఎదిగాక రాకేష్ మాస్టర్ ని నిర్లక్ష్యం చేశాడనే వాదన ఉంది. ఇద్దరికీ దూరం పెరిగింది. ఈ గొడవలకు కారణాలు ఏమిటో కొన్ని ఇంటర్వ్యూలో ఇద్దరూ చెప్పుకొచ్చారు.. 
 

26
Rakesh Master

రాకేష్ మాస్టర్- శేఖర్ మాస్టర్ మధ్య గొడవలకు బీజం పడింది, చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీ విషయంలో. ఆ మూవీలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ విషయం శేఖర్ మాస్టర్ నాకు చెప్పకుండా దాచాడు అనేది రాకేష్ మాస్టర్ ఆరోపణ. శేఖర్ నేను కలిసి ఎన్నో బాధలు అనుభవించాము. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే పేరెంట్స్ ని కలిసి పిల్లను ఇవ్వమని అడిగాను, వారు సినిమా వాళ్లకు ఇవ్వము అన్నారు. 
 

36


శేఖర్ కి నేను ఒకటే చెప్పాను... నువ్వు, నేను వేరొకరితో అబద్ధాలు చెప్పిన పర్లేదు. మనం మాత్రం ఒకరి గురించి ఒకరు అబద్దాలు చెప్పుకో కూడదు. ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పాను. చిరంజీవి వంటి హీరో సినిమా ఛాన్స్ వాడు నాకు చెప్పలేదు. భార్యకు చెప్పాడు, నాకు చెప్పలేదు. 
 

46


వాడు చాలా ఎత్తుకు ఎదిగాడు. నేను వెతుక్కుంటూ వెళ్ళాను. నాకు వచ్చిన ఆఫర్స్ కూడా శేఖర్ కరెక్ట్ అని రిఫర్ చేశాను. వాడు బాగుండాలనే నేను కోరుకుంటాను. అయితే వాడిని నేను ఎప్పటికీ కలవను. నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దని చెబుతున్నాను. వాళ్ళ భార్య కూడా నన్ను శత్రువును చూసినట్లు చూస్తుంది. నా గురించి మాట్లాడుతూ హేళనగా నవ్వాడు, అని శేఖర్ తన ఆవేదన వెళ్లగక్కాడు. 
 

56


రాకేష్ మాస్టర్ ఆరోపణలకు శేఖర్ మాస్టర్ స్పందించాడు. చిరంజీవి సినిమాకు రెండు సాంగ్స్ చేస్తానని నాకు పూర్తి స్పష్టత లేదు. కన్ఫర్మ్ అయ్యాక చెబుదామని అనుకున్నాను. ఆయన నాకు గురువు గారు. ఆయనకున్న వేల మంది శిష్యుల్లో నేను కూడా ఒకడిని. నాకు డాన్స్ నేర్పారు నేను ఒప్పుకుంటాను. అవకాశాల  విషయంలో ఎవరి కష్టం వాళ్ళది. 
 

66
Rakesh Master


నన్ను ఏరా పోరా అన్నా కూడా నేను బాధపడను. అంతకు మించి అంటే బాధేస్తుంది. తాగి మా అమ్మను తిట్టాడు. నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని రాకేష్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ ఆరోపణలు చేశాడు. ఈ కారణాలతో శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ దూరం కావడం జరిగింది. మరి రాకేష్ మాస్టర్ నేడు చనిపోగా... శేఖర్ ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తాడో లేదో చూడాలి... 
 

Read more Photos on
click me!

Recommended Stories