ఎంతో మందికి తిండి పెట్టిన రాకేష్ మాస్టర్.. అనాథాశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా?

First Published | Jun 18, 2023, 8:43 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master Death) ఎంతో మందిని దగ్గరికి తీశారు. తిండిపెట్టి మరీ కొరియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి ఒకానొక దశలో అనాథాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తాజాగా అనారోగ్యంతో మృతి చెందారు. గాంధీ ఆస్ప్రతిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు నివాళి అర్పిస్తున్నారు. 
 

1500 సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఆయన అకాల మరణంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో తన టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 
 


ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ చాలా మంది డాన్సర్లను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్లు గా దూసుకెళ్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ ద్వారానే పరిచయం అయ్యారనే విషయం తెలిసిందే. 
 

వీరిద్దరితో పాటు చాలా మందికి రాకేష్ మాస్టర్ తిండిపెట్టి మరీ షెల్టర్ ఇచ్చారు. తను నివసించే ఇంటిలోనే వారందరికీ తిండిపెట్టి చక్కగా చూసుకున్నారు. అన్ని విధాలా తనవంతు సహకారం అందించారు. అలాంటి వ్యక్తి ఒకానొక దశలో అనాథాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

కుటుంబ సమ్యసలు, నా అనుకున్న వాళ్లు కొద్దిరోజుల కింద దూరమడంతో రాకేష్ మాస్టర్ ఒంటిరిగా మిగిలిపోయారు. ఇందుకు సంబందించిన పలు వీడియోలు కూడా ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే  మద్యానికి కూడా అలవాటయ్యారు. అందరిపై నమ్మకం కోల్పోయిన ఆయన అనాథాశ్రమంలో జీవించాలని నిర్ణయించుకున్నారు. 
 

గతేడాది రాకేష్ మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్ లోని ఓ అనాథాశ్రమంలో నివసించారు. నా అనుకున్న వాళ్లు దూరం పెట్టడంతోనే అలా చేశారు. టాలీవుడ్ లో వెలుగు వెలిగిన రాకేష్ మాస్టర్ ఓల్డేజ్ హోమ్ లో ఉండటం అందరినీ బాధించింది. అక్కడ ఉండటమే కాకుండా తనవంతుగా ఆర్థిక సాయమూ హోమ్ కు అందించారు.మొన్నటి వరకూ సోషల్ మీడియాలో సందడి చేసిన ఆయన ఆకస్మికంగా మరణించారు. 

Latest Videos

click me!