ఆయనతో అనసూయ రొమాంటిక్ డిన్నర్ నైట్... కళ్లద్దాలు పెట్టుకొని రంగమ్మత్త రచ్చ..!

Published : Sep 18, 2022, 08:41 PM ISTUpdated : Sep 19, 2022, 08:16 AM IST

తీరిక దొరికితే చాలు అనసూయ విందులు విహారాలకు చెక్కేస్తారు. ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడపడం అనసూయకు ఇష్టమైన వ్యాపకం. ఇక వీకెండ్ కావడంతో భర్త భరద్వాజ్ తో డిన్నర్ నైట్ కి వెళ్ళింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

PREV
16
ఆయనతో అనసూయ రొమాంటిక్ డిన్నర్ నైట్... కళ్లద్దాలు పెట్టుకొని రంగమ్మత్త రచ్చ..!
Anasuya Bharadwaj

కాలేజ్ గర్ల్ మాదిరి షార్ట్ ఫ్రాక్ లో డిన్నర్ కి వచ్చింది. అనసూయ లుక్ టూ మచ్ హాట్ గా ఉంది. మోకాళ్ళకు జానెడు పైనున్న ఆమె డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. అనసూయ పొట్టి బట్టలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె ఐ డోంట్ కేర్ అంటున్నారు. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్నారు.

26
Anasuya Bharadwaj

ఈ మధ్య అనసూయ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆమె లైగర్ మూవీ పరాజయాన్ని ఎంజాయ్ చేస్తూ ట్వీట్ చేశారు. తల్లిని తిట్టిన పాపం వెంటాడి లైగర్ ప్లాప్ అయ్యిందంటూ పరోక్షంగా సోషల్ మీడియా కామెంట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు.

36
Anasuya Bharadwaj


ఆంటీ అంటూ అనసూయపై ట్రోల్స్ కి తెగబడ్డారు. మరో వైపు అనసూయ కూడా తగ్గలేదు. వందల మంది నెగిటివ్ కామెంట్స్ కి సమాధానం చెప్పారు. అలాగే ఆంటీ అన్నవారిపై చర్యలు తీసుకున్నారు. సైబర్ క్రైమ్ లో తనను ఆంటీ అని వేధిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. 
 

46

దాదాపు వారం రోజుల పాటు సాగిన ఆ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. ఈ వివాదం అనసూయ ఇమేజ్ ని దెబ్బతీసినట్లు తెలుస్తుంది. ఆమెకు కొన్ని ఆఫర్స్ దూరమయ్యాయంటూ కథనాలు వెలువడ్డాయి. మరి ఆ వార్తలో నిజమెంతో తెలియదు కానీ... ప్రముఖంగా ప్రచారమైంది. 
 

56

ఇక జబర్దస్త్ వదిలేసిన అనసూయ స్టార్ మాకి వెళ్లారు. అక్కడ స్టార్ సింగర్స్ అనే మ్యూజిక్ షో చేశారు. ఇటీవల ఆ షో ముగిసింది. అయినప్పటికీ అనసూయ ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తున్నట్లు సమాచారం. నటిగా ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె సినిమా అవకాశాల పైనే దృష్టి పెడుతున్నారు.

66


ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అనసూయ హీరోయిన్ గా నటించిన దర్జా, పండుగాడు వాంటెడ్ విడుదలయ్యాయి. ఇవి రెండు అనుకున్న స్థాయిలో ఆడలేదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories