ఒకే దుప్పట్లో ముగ్గురు తెల్లారే సరికి ఒంటి పై... దారుణమైన వాళ్ళ వ్యవహారం బయటపెట్టిన ఆరోహి!

Published : Sep 18, 2022, 08:06 PM IST

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసింది ఆరోహిరావు. ముగ్గురు కంటెస్టెంట్స్ ఒకే దుప్పట్లో దూరుతున్నారని దారుణమైన కామెంట్స్ చేసింది. ఆమె చెప్పిన విషయానికి గెస్ట్ తమన్నా తో పాటు హోస్ట్ నాగార్జున షాక్ అయ్యారు.   

PREV
16
ఒకే దుప్పట్లో ముగ్గురు తెల్లారే సరికి ఒంటి పై... దారుణమైన వాళ్ళ వ్యవహారం బయటపెట్టిన ఆరోహి!
Bigg boss Telugu 6

శనివారం ఎపిసోడ్ అంతా హాట్ హాట్ గా సాగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తినటానికి పడుకోవడానికి హౌస్ కి వచ్చారా? అంటూ ఏకి పారేశాడు. తొమ్మిది మంది కంటెస్టెంట్స్ గేమ్ వరస్ట్ గా ఉందన్న నాగార్జున వారిలో ఒకరైన షానిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశాడు.ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ తో పాటు ఆటను సీరియస్ గా తీసుకోనివారి కూడా నాగార్జున ఏకిపారేశారు.

26
Bigg boss Telugu 6

ఇక నిన్న వ్యవహారం అంతా సీరియస్ గా సాగిన నేపథ్యంలో నేడు హోస్ట్ నాగార్జున కొంచెం కూల్ గా కనిపించారు. ఆయన కంటెస్టెంట్స్ తో సరదా ప్రశ్నలు వేశారు. ఎంటర్టైనింగ్ గేమ్స్ తో వాళ్ళలో జోష్ నింపారు. ఇక ఆదివారం ఎపిసోడ్ కి హీరోయిన్ తమన్నా గెస్ట్ గా వచ్చారు. ఆమె కొత్త మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా షోకి రావడం జరిగింది.
 

36
Bigg boss Telugu 6

కాగా ఆమె సమక్షంలో ఓ చిలిపి సంఘటన జరిగింది. కంటెస్టెంట్ శ్రీహాన్ ప్రతిరోజూ నిద్ర లేచి చూసుకుంటే మెడపై ఓ మార్క్ ఉంటుంది. నా ప్రక్క బెడ్ కి అర్జున్ వచ్చినప్పటి నుండి ఇలా జరుగుతుందని నాగార్జునతో చెప్పారు. శ్రీహాన్ అనుమానానికి సమాధానం ఆరోహి రావు నుండి వచ్చింది. వాళ్ళు ముగ్గురేసి ఒకే దుప్పట్లో దూరుతున్నారు. ఆ కారణంగానే ఒంటిపై మార్కులు అంటూ... క్లారిటీ ఇచ్చింది.
 

46
Bigg boss Telugu 6

ముగ్గురు మగాళ్లు ఒకే దుప్పట్లో పడుకుంటున్నారని ఆరోహి చెప్పింది. శ్రీహాన్ బ్యాచ్ పై ఆరోహి కామెంట్ కి హోస్ట్ నాగార్జున, గెస్ట్ షాక్ అయ్యారు. తమన్నా సిగ్గుతో కళ్ళు మూసుకున్నారు. అబ్బాయిలు ఒకే దుప్పట్లో దూరడం ఏమిటో అర్థం కాలేదు.
 

56
Bigg boss Telugu 6


ఇక హౌస్ లో ప్రేమ జంటల ప్రస్తావన కూడా వచ్చింది. ఆరోహి రావు, ఆర్జె సూర్య మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం కంటెస్టెంట్స్ వ్యక్తం చేశారు. అభినయశ్రీ అయితే... అవును సార్ నేను గమనించాను. ఆరోహి రావు, అర్జె సూర్య మధ్య సంథింగ్ సంథింగ్ అన్నారు. మూడేళ్ళ కలగనిది ఈ రెండు వారాల్లో ఏం కలుగుతుంది సార్... అలాంటిదేమీ లేదని ఆమె తిప్పి కొట్టారు.
 

66
Bigg boss Telugu 6


కాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని నాగార్జున నిన్న చెప్పారు. షాని శనివారం ఎలిమినేట్ కాగా నేడు ఒకరు హౌస్ నుండి వెళ్ళిపోనున్నారు. షాని వెళ్ళిపోయాక ఎలిమినేషన్ లో ఏడుగురు సభ్యులు మిగిలారు. వీరి నుండి ఒకరు హౌస్ వీడనున్నారు. ఇక గత వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నిలిపి వేసిన విషయం తెలిసిందే.
 

Read more Photos on
click me!

Recommended Stories