కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
26
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
36
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
46
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇటీవలే తల్లి అయింది. కాజల్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీనితో కాజల్, కిచ్లు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
56
kajal aggarwal
తాజాగా కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో కాజల్ గుర్రంతో సరదాగా గడుపుతూ దానికి ఆహారం అందిస్తోంది. చెన్నైలోని హార్స్ రైడింగ్ సెంటర్ లో కాజల్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తోంది.
66
ఈ సందర్భంగా కాజల్ ఎలాంటి మేకప్ లేకుండా సహజంగా బ్యూటిఫుల్ లుక్ లో మెరిసిపోతోంది. క్యూట్ గా గా ఉన్న ఈ ఫోటో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. లక్షల మంది నెటిజన్లు ఈ పిక్ కి లైకులు కొడుతున్నారు.