మిడ్ నైట్ పార్టీకి శారీలో అనసూయ అదుర్స్... అందాల ఆరబోత

First Published | Jan 27, 2021, 5:05 PM IST

ఆంటీ అంటూ అనసూయను ఎంత మంది ట్రోల్ చేసినా, ఆమె అందాలు మాత్రం యంగ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదు. నిలువెత్తు సోయగాలతో అనసూయ అందాల విందు ఆస్వాదించనివారంటూ లేరు. 

ఏళ్లుగా బుల్లితెర మహారాణిగా, కుర్రాళ్ళ కలలు సుందరిగా అనసూయ తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు.  అనసూయ యాంకర్ గా ఉందంటే కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా షో సక్సెస్ కావలసిందే.
అది జబర్ధస్త్ కావచ్చు, రంగస్థలం కావచ్చు.. షో ఏదైనా అనసూయ తన మేనియాతో నడిపించేస్తుంది.

తాజాగా అనసూయ సెక్సీ శారీలో ముస్తాబై మిడ్ నైట్ పార్టీకి హాజరయ్యారు.  పలుచని పొరల నల్ల చీర, గోల్డ్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ లో అనసూయ మెస్మరైజ్ చేశారు.
పొరల చాటు నుండి అనసూయ నడుము అందాలతో కవ్విస్తుండగా ఫోటోలు హాట్ అంటూ ఫ్యాన్స్ నోరెళ్ళ బెడుతున్నారు.
ప్రదీప్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన 30రోజుల్లో ప్రేమించడం ఎలా? మూవీ ప్రమోషనల్ సాంగ్ లో అనసూయ నటించారు. నైట్ పబ్ సెటప్ లో ప్రదీప్ పక్కన అనసూయ స్టెప్స్ వేశారు.
ఈ సాంగ్ లో రష్మీ, శ్రీముఖి సైతం పాల్గొనగా ముగ్గురు కలిసి ప్రదీప్ పక్కన మాస్ స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఈ సాంగ్ షూట్ కోసం అనసూయ హాట్ హాట్ గా తయారయ్యారు.
ప్రస్తుతం అనసూయ యాంకర్ గా కంటే కూడా నటిగా ఫుల్ బిజీ అయ్యారు. అనసూయ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
తెలుగుతో పాటు, మలయాళ, తమిళ చిత్రాలలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం.  కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, సిల్క్ స్మిత బయోపిక్ లో అనసూయ నటిస్తున్నారు. అలాగే నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడానికి సైన్ చేశారు.
థాంక్ యూ బ్రదర్ పేరుతో ఓ వెబ్ మూవీ తెరకెక్కుతుండగా అనసూయ గర్భవతి పాత్ర చేస్తున్నారు. ఇక తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.
వీటితో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి హీరోగా చేస్తున్న ఓ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉండగా... యాంకర్ గా నటిగా రెండు రంగాలను బ్యాలన్స్ చేస్తూ జెట్ వేగంతో వెళుతున్నారు.

Latest Videos

click me!