అనసూయపై అసభ్యకర కామెంట్స్.. యూట్యూబ్ ఛానల్స్ కి గట్టిగా ఇచ్చింది

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 24, 2021, 07:25 PM IST

యాంకర్ అనసూయకు టాలీవుడ్ లో ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతోంది. ఇటీవల పుష్ప చిత్రంలో అనసూయ ద్రాక్షాయణి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

PREV
16
అనసూయపై అసభ్యకర కామెంట్స్.. యూట్యూబ్ ఛానల్స్ కి గట్టిగా ఇచ్చింది

యాంకర్ అనసూయకు టాలీవుడ్ లో ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతోంది. ఇటీవల పుష్ప చిత్రంలో అనసూయ ద్రాక్షాయణి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రని మించేలా ద్రాక్షాయణి పాత్ర ఉంటుందని అంతా భావించారు. కానీ ఆమె రోల్ పుష్ప చిత్రంలో ఆకట్టుకోలేకపోయింది. 

26

ఇక బుల్లితెర షోలలో అనసూయ చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తన అందంతో కుర్రాళ్లకు అనసూయ కితకితలు పెడుతూ ఉంటుంది. జబర్దస్త్ షోలో స్కిన్ షోతో అనసూయ రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. 

36

ఇదిలా ఉండగా అనసూయ తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అలాగే ఆమె చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తనపై హాట్ కామెంట్స్ చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాయి అని అనసూయ మండిపడింది. 

46

ముఖ్యంగా తనని ఉద్దేశించి చేసే వీడియోలకు అసభ్యకరమైన థంబ్ నైల్స్ పెడుతున్నారని అనసూయ తెలిపింది. అనసూయ లావైపోయింది, అనసూయ షాకింగ్ లుక్ అంటూ ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్స్ పెడుతారు. ఒక లావు కావడం, తగ్గడం అది నా వ్యక్తి గతం. 

56

ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ మనిషన్నాకా అన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా ఉండలేం. నాకు కూడా వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా అని అనసూయ పేర్కొంది. యూట్యూబ్ ఛానల్స్ వారి దిగజారుడు తనాన్ని ఎలా సమర్ధించుకుంటాయి. నేనూ వారిలా మాట్లాడగలను కానీ నాకు వ్యక్తిత్వం ఉంది అని అనసూయ పేర్కొంది. 

66

ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. అనసూయకు లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. వెండితెరపై వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉన్నట్లు అనసూయ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొంది. Also Read: Bheemla Nayak: 'భీమ్లా నాయక్' హీరోయిన్ చీరకట్టు అందాలు.. అదరహో అనిపిస్తున్న మలయాళీ భామ

click me!

Recommended Stories